చిత్రం చెప్పే విశేషాలు!
(15-12-2022/1)
ఇకపై మీ విజిటింగ్ కార్డుందా..? మాటలకు బదులు మీ క్యూఆర్ కోడ్ ఇస్తారా...? అని అంటారు. హైటెక్‌సిటీలోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ‘టైగ్లోబల్ సదస్సు-2022’లో అనేక అంకుర సంస్థల ప్రతినిధులు ఈ డిజిటల్ విజిటింగ్‌కార్డుల ద్వారా సమాచారం పంచుకుంటూ కనిపించారు.
source:eenadu
నల్గొండ - నాగర్‌కర్నూల్ జిల్లా సరిహద్దులో నిర్మాణంలో ఉన్న నక్కలగండి ప్రాజెక్టు పరిధిలో.. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రకృతి అందాలను సంతరించుకుంది. నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణం ఒకవైపు జరుగుతుండగా.. మరోవైపు వరదనీరు పారుతూ.. పర్యాటకులను ఆకర్షిస్తోంది.
source:eenadu
హనుమకొండ కుమార్‌పల్లిలోని మంచినీటి ట్యాంక్ శుభ్రం చేయడానికి బుధవారం అందులోని నీరు తొలగించగా ఇలా ఏరులై పారింది. దీనికి తోడు మురుగు కాలువల్లో చెత్తాచెదరం పేరుకుపోవడంతో అక్కడ నీరు కలిసిపోయి రోడ్డంతా చెరువును తలపించింది.
source:eenadu
అడ్డతీగల మండలం వేటమామిడి పంచాయతీ పనుకురాతిపాలెం గ్రామంలో సుమారు 90 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇక్కడి నుంచి మండలానికి రావాలంటే పెద్దేరు వాగు ప్రమాదకరంగా దాటాల్సిందే. నిత్యావసరాలు, వైద్యం, చదువు కోసం అక్కడి గిరిజనులు సాహసమే చేస్తున్నారు.
source:eenadu
ఇటీవల కురిసిన వర్షానికి రాళ్లపాడు జలాశయం నీటిని మన్నేరు దిగువకు వదలగా రెండు రోజులుగా ప్రవాహం ఉద్ధృతంగా సాగింది. బుధవారం ఉదయం కాస్త తగ్గగా.. మన్నేరు చెక్‌డ్యామ్ వద్ద చేపల వేటకు వరుస కట్టారు. సుమారు 30 మంది వరకు వలలు పట్టి చేపలను పట్టడం చూపరులను ఆకట్టుకుంది.
source:eenadu
ఎర్రటి వర్ణంతో ఆకర్షించే కాళ్లు, పెంకు రంగులో ఉండే ఛాతీ పక్క భాగం, తెలుపు, నలుపు మిళితమైన వర్ణంతో వెనుకభాగం ఉండే ఈ పక్షి రడ్డీ బ్రెస్టెడ్ క్రేక్ (ఎర్రబొర్ర వడికోడి). ఇది 50 నుంచి 65 గ్రాముల బరువు ఉంటుంది. మంచినీటి సరస్సుల్లో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది.
source:eenadu
కమలాపురం సమీపంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో పాపఘ్ని నదిపై నిర్మించిన వంతెన గతేడాది నవంబరులో కూలిపోవడంతో నదిలో తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు నిర్మించారు. వెలిగల్లు జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ రోడ్డు ముంపునకు గురై ప్రమాదకరంగా మారింది.
source:eenadu
చిత్రంలో కన్పిస్తోంది సుమారు 1050 మందికి వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం కనపర్తిలో కేటాయించిన జగనన్న కాలనీ. ఎగువన చెరువు నీరు, సమీప పొలాల నుంచి వచ్చే సాగునీరు చేరి చిన్నపాటి వర్షం కురిసినా పెద్ద కొలనును తలపిస్తోంది.
source:eenadu