చిత్రం చెప్పే విశేషాలు!

(16-12-2022/1)

వికారాబాద్‌ అనంతగిరి కొండపై ఉన్న అటవీ శాఖ అతిథి గృహంలో సిబ్బంది మలచిన కళాకృతి ఇది. వాడిన జువ్వి చెట్టు కొమ్మను నిరుపయోగంగా ఉన్న బోర్‌వెల్‌ పైపులో పెట్టి చుట్టూ బండరాళ్లను పేర్చి కళాత్మకంగా తీర్చిదిద్దారు. సిబ్బంది కళాసక్తిని సందర్శకులు అభినందిస్తున్నారు.

source:eenadu

ఇనుప బుట్టలను ద్విచక్రవాహనంపై ఓ యువకుడు ప్రమాదకరంగా తరలిస్తున్నాడు. నగరంలోని షేక్‌పేట దర్గా సమీపంలో అర్ధరాత్రి వేళ కనిపించిన చిత్రమిది.

source:eenadu

నారాయణగూడ పైవంతెనపై ఆయిల్‌ పడటంతో వాహనదారులు జారిపడుతున్నారు. ఇది గమనించిన ట్రాఫిక్‌ హోంగార్డ్‌ అల్లాభక్ష్ క్రౌన్‌ కేఫ్‌ చౌరస్తా నుంచి మట్టి తీసుకొచ్చి ఆయిల్‌ పడ్డ చోట పోశారు.

source:eenadu

భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లలో అధికారుల సమన్వయలోపం కనిపిస్తోంది. ఇష్టానుసారం బారికేడ్లు ఏర్పాటు చేయడంతో బస్టాండు నుంచి కనకదుర్గ పై వంతెన వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇటు భవానీలు, అటు వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

source:eenadu

చిత్తూరు జిల్లాలో రోడ్లు గోతులుగా మారడంతో వాహన చోదకుల పరిస్థితి దయనీయంగా మారింది. కట్టమంచి నుంచి సాంబయ్య కండ్రిగ వెళ్లే రోడ్డంతా బురదతోను, అడుగుకో భారీ గుంతతో నరకానికి నకలుగా ఉంది. ఈ దారిలో ప్రయాణం అంటేనే అబ్బో మేము రాం.. అనేస్తున్నారు ఆటోవాలాలు.

source:eenadu

అల్లూరి జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గ్లాడియోలస్‌ పూల సోయగాలు కట్టిపడేస్తున్నాయి. అగ్రి టూరిజంలో భాగంగా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా వివిధ రకాల పూలు సాగు చేస్తున్నారు. లిల్లియం, చైనాఆస్టర్‌, జెర్బరా, తులిప్‌ వంటి రకాలూ ఇక్కడ ఉన్నాయి.

source:eenadu

చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపరెడ్డిపల్లి గ్రామ సమీపంలో చిత్రావతి నది ప్రవాహంతో కాజ్‌వేపై రాకపోకలకు ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

source:eenadu

తుపాను ప్రభావంతో నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర గురువారం నుంచి పునఃప్రారంభమైంది. పోశమ్మగండి నుంచి మూడు బోట్లపై పర్యటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home