చిత్రం చెప్పే విశేషాలు!
(17-12-2022/1)
యాదాద్రి పుణ్యక్షేత్రంలోని అనుబంధ శివాలయం శుక్రవారం ఇలా భక్తులను ఆకట్టుకుంది. సుప్రభాత వేళ ఆలయం మీదుగా కనిపించిన సూర్యోదయం కనువిందుగొల్పింది.
source:Eenadu
క్రిస్మస్.. వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ‘మంచుకొండపై జింక బొమ్మలు’ సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ప్యాట్నీసెంటర్‌లో క్రిస్మస్ తాత వేషధారణ ఆకట్టుకుంది.
source:Eenadu
చేవెళ్ల పట్టణం రోజు రోజుకు విస్తరిస్తోంది. పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్లాట్లు కొని బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. దీంతో వేగంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది.
source:Eenadu
మాండౌస్ తుపాను అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీసింది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురానికి చెందిన నాగన్న 8 ఎకరాల్లో వరి సాగు చేసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి వాటిపై పరదా కప్పారు. శుక్రవారం బస్తాలపై ఉన్న పరదాలు తొలగించగా పచ్చటి మొలకలు కనిపించాయి.
source:Eenadu
పెళ్లిళ్లు తదితర శుభకార్యాల్లో ఇటీవల భారీ సెట్టింగులు వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏనుగు(కరి)లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఖమ్మంలో ఓ పార్కులో ఏర్పాటు చేసేందుకు హయత్‌నగర్ సమీపంలోని పెద్దఅంబర్‌పేట్‌లో విగ్రహాల తయారీదారుకి ఆర్డరు లభించింది.
source:Eenadu
కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా దంత సమస్యలకు చికిత్స అందిస్తోంది ఉస్మానియా డెంటల్ ఆసుపత్రి. నిత్యం వేయి మందికిపైగా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఆధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, సుమారు వంద మందికి పైగా వైద్య విద్యార్థులు అందుబాటులో ఉన్నారు.
source:Eenadu
రంగారెడ్డి జిల్లా కందకూరుకు చెందిన రైతు రూ.60 వేల పెట్టుబడితో ఎకరంలో క్యాబేజీ, అరెకరంలో వంగ సాగు చేశారు. గిట్టుబాటు ధర రాక పొలంలోనే వదిలేయడంతో ఆ పంటలు గొర్రెలకు మేతగా మారాయి. మార్కెట్లో కిలో ధర రూ.10-15 పలుకుతుండగా రైతుకు రూ.3 కూడా దక్కడం లేదు.
source:Eenadu
గౌతంనగర్ రైల్వేగేటు మూసిన సమయంలో త్వరగా వెళ్లాలన్న ఆత్రుతతో ప్రమాదకరమని తెలిసినా ప్రయాణికులు పట్టాలపై రాకపోకలు సాగిస్తున్నారు. శుక్రవారం గౌతంనగర్ గేటు వద్ద కనిపించిన దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించింది.
source:Eenadu