చిత్రం చెప్పే విశేషాలు!
(19-12-2022/1)
శుభకార్యాలకు హాజరైనవారు కొందరు, వారాంతపు సెలవులు ముగించుకుని తిరుగు ప్రయాణమైనవారు మరికొందరు.. వారి వాహనాలతో చిట్యాల వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి ఆదివారం సాయంత్రం రద్దీగా మారింది.
source:Eenadu
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లో ప్రభుత్వం పైవంతెనలు, ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్నింటిని పూర్తి చేసింది. వీఎస్‌టీ, ఇందిరాపార్కు మధ్య చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా సాగుతోంది. ఇందిరాపార్కు వద్ద నిర్మాణంలో ఉన్న పైవంతన.
source:Eenadu
హైదరాబాద్‌లో ఆదివారం ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ పి.వెంకట్రామిరెడ్డి కుమారుని పెళ్లి రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్, శోభ దంపతులు, ఎమ్మెల్సీ కవిత హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
source:Eenadu
హుస్సేన్ సాగర్‌లోకి మురుగు, రసాయన జలాల ప్రవాహం ఆగకపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. సాగర్ ఎదుట జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నాలా నుంచి వెళుతున్న ప్రవాహం ద్వారా వస్తున్న నురుగు దుర్వాసనతో రోడ్డుపై వెళ్లే జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
source:Eenadu
ఆరోగ్యం కాపాడుకోవాలన్న ఆలోచనతో నెక్లెస్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన హైదరాబాద్ 10కే రన్ ఉత్సాహంగా సాగింది. ఫ్రీడమ్ హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పతకంతో పాటు విజేతలకు నగదు అందజేసి అభినందించారు
source:Eenadu
నిరుపేద పిల్లల కోసం విరాళాల సేకరణ కార్యక్రమంలో భాగంగా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఆదివారం నిర్వహంచిన పరుగు పందెలో శాంతాక్లాజ్ దుస్తులు ధరించి పాల్గొన్న ప్రజలు.
source:Eenadu
విశాఖపట్నంలోని యారాడ సముద్ర తీరం మీదుగా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఆదివారం భారీ తిమింగలం చిక్కింది. సుమారు 10 అడుగుల పొడవైన తిమింగలాన్ని అతికష్టం మీద తీరానికి తీసుకొచ్చేసరికి కొన ఊపిరితో కొట్టుమిట్టాడి.. మృతి చెందింది.
source:Eenadu
క్రిస్మస్ సందర్భంగా కేపీహెచ్‌బీ నెక్సస్ మాల్‌లో పోలార్ ఎక్స్‌ప్రెస్ పేరుతో రైలు నమూనాను తయారు చేసి అందులో క్రిస్మస్ ట్రీ, ఇతర అలంకరణలను ఉంచారు. అక్కడికి వచ్చే యువత వాటి పక్కన సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
source:Eenadu
వ్యర్థాలు వినియోగిస్తూ హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లను హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సుందరంగా తీరిదిద్దుతున్నారు. శేరిలింగంపల్లి పరిధి దుర్గం చెరువు తీగల వంతెన వద్ద ఇనుప డ్రమ్ములు, చువ్వలు, నట్లు, గొట్టాలను ఉపయోగించి పల్లె వాసులు ముచ్చటించుకుంటున్నట్లు రూపునిచ్చారు.
source:Eenadu