చిత్రం చెప్పే విశేషాలు!

(20-12-2022/1)

ఆహారం కోసం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ చెరువు గట్టున ఓ కొంగ కాపుకాసింది. నీటిలో చేప కనిపించడంతో పదునైన ముక్కుతో ఒడిసిపట్టింది. చేపను వేటాడేందుకు ముక్కుతో రెప్పపాటు కాలంలో బలంగా నీటిపై పొడవడంతో దడికట్టినట్టు నీరు ఇలా పైకి లేచి ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

source:Eenadu

కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో దట్టంగా మంచు కురవడంతో తెల్లటి దుప్పటి పరుచుకున్నట్లు కనిపిస్తున్న ఇళ్లు, రహదారులు

source:Eenadu

సినీ కథానాయికలు అనన్య నాగళ్ల, కోమలి ప్రసాద్, ఐశ్వర్య సోమవారం రూపదర్శినులతో కలిసి మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో సందడి చేశారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. రూపదర్శినులు సరికొత్త డిజైన్‌ దుస్తులు, ఆభరణాలు ధరించి హొయలు పోయారు.

source:Eenadu

గుంతకల్లు పట్టణం పాతగుంతకల్లు రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ ధర్మకర్త వెంకటరెడ్డి, అర్చకుడు ప్రసాద్‌స్వామి ఆధ్వర్యంలో ఐదో నెల కావడంతో గోమాతకు సీమంతం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై గోవును అలంకరించి పూజలు చేసినట్లు ధర్మకర్త, అర్చకులు తెలిపారు.

source:Eenadu

ఐటీ క్షేత్రంలోని ప్రతీ ప్రాంతం కొత్తందాలను సంతరించుకుంటోంది. రహేజా మైండ్‌ స్పేస్‌ స్కైవాక్‌ మధ్య కూడలిలో కొత్తగా పైలాన్‌ నిర్మాణంలో ఉండగా మాదాపూర్‌ పత్రికానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తున్న ఉద్యానంలో విభిన్న ఆకృతులు రూపుదిద్దుకుంటున్నాయి.

source:Eenadu

 సోమాజిగూడలోని విల్లా మేరీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన గణితం, సైన్సు ప్రదర్శన ఆలోచింపజేసింది. ఇంటర్‌ విద్యార్థినులు తమ పాఠ్యాంశాల ఆధారంగా వివిధ వస్తువులను తయారు చేసి ప్రదర్శనలో విక్రయించారు. స్టాళ్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడి చేశారు. 

source:Eenadu

ప్రముఖ సినీ తార రాశీఖన్నా సోమవారం విశాఖ నగరానికి వచ్చారు. ఒక ప్రముఖ దుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.  

source:Eenadu

గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌ రోడ్డులో చెత్తను తరలించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ చెత్తకుప్పకు నిప్పు అంటించారు. మరోవైపు ఈ కుప్పలోని వ్యర్థాలను తినేందుకు వచ్చే జంతువులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.

source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home