చిత్రం చెప్పే విశేషాలు!
(21-12-2022/1)
రానున్న క్రీస్తు జన్మదినం క్రిస్మస్ సందర్భంగా చర్చిల చెంత ప్రత్యేక ఏర్పాట్లు మొదలయ్యాయి. అబిడ్స్ చాపెల్ రోడ్‌లోని మెథడిస్ట్ చర్చిలో చేసిన ప్రత్యేక అలంకరణ ఇది.
source:eenadu
కొత్త సంవత్సరం తొలిరోజు నుంచి ప్రారంభమయ్యే నుమాయిష్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఓవైపు స్టాళ్లు, మరోవైపు జెయింట్ వీల్ తదితర వాటిని బిగించే పనులు కొనసాగుతున్నాయి.
source:eenadu
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక పుష్కరఘాట్ వద్ద గౌతమీ గోదావరిలో చేపల వేట నిర్వహిస్తున్న మత్య్సకారుల వలలో మొసలికూన చిక్కింది. దాన్ని వల నుంచి తప్పించి తిరిగి నదిలో వదిలేసినట్టు మత్య్సకారులు తెలిపారు.
source:eenadu
కోతల అనంతరం ధాన్యాన్ని ఆరబెట్టడానికి పొలాల్లో కల్లాలు లేక ఔటర్ సర్వీసు రహదారుల వెంట కిలోమీటర్ల మేర ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. శంషాబాద్ శివారులో ఓ రైతు రాత్రి 10 గంటల తరువాత కూడా ఆరబోసిన ధాన్యం పక్కన కాపలాగా కూర్చున్నాడు.
source:eenadu
యాసంగిలో కర్బూజ, పప్పుశనగలను సాగు చేసే పనుల్లో కర్షకులు నిమగ్నమయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని పాతసాసనూలు గ్రామంలో కృష్ణా తీరాన గుట్టపైనున్న వీరభద్రుడి ఆలయం నుంచి కనిపిస్తున్న సుందర దృశ్యమిది.
source:eenadu
కంచికచర్ల-ఇబ్రహీంపట్నం దారిలో దొనబండ వద్ద జాతీయరహదారిపై చూడండి ఏకంగా జెర్సీ బ్లాకులతో రహదారిపైకి అడ్డంగా వచ్చేలా మార్గాన్ని ఏర్పాటు చేశారు. క్వారీ లారీలు వేగంగా తిరుగుతూ ధూళిని వెదజల్లుతున్నాయి.
source:eenadu
శామీర్‌పేట మండలం లాల్‌గడీ మలక్‌పేట-తుర్కపల్లి రహదారిలో పాలకవర్గం, అధికారులు నాటిన హరితహారం మొక్కలపై పర్యవేక్షణ కరవైంది. దారి పొడవునా గార్డులు పడిపోయాయి. కొన్ని చోట్ల మొక్కలు విరిగిపోయాయి.
source:eenadu
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తిరువెట్టారు సమీప వేర్ కిళంబికల్లంగుళి ప్రాంతానికి చెందిన విల్సన్ తన పొలంలో పండిన కందలను తూకం వేసి చూడగా ఒక్కోటి 60 కిలోల పైగానే ఉన్నాయి. కేవలం సహజ ఎరువులే వాడినట్లు విల్సన్ తెలిపారు.
source:eenadu