చిత్రం చెప్పే విశేషాలు!

(22-12-2022/1)

ఈమె వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు. ఇంటి వద్ద చిన్నారిని చూసుకునే వారు లేకపోవడంతో పాఠశాలకే తీసుకొస్తున్నారు. తరగతి గదిలోనే చీరతో ఊయల ఏర్పాటు చేసి నిద్రపుచ్చుతున్నారు.

source:eenadu

వెంకటాచలం మండలంలో ఎగువమిట్ట నుంచి పూడిపర్తికి వెళ్లే మార్గంలో సుమారు రెండు కిలోమీటర్లు మేర... రోడ్డుకిరువైపులా వందల సంఖ్యలో తాటిచెట్లు ఉన్నాయి. రోడ్డు విస్తరణ, పైపులైన్‌ ఏర్పాటుకు అధికారులు తొలగించాలనుకున్నా... స్థానికులు అందుకు అంగీకరించలేదు.

source:eenadu

ట్రాక్టరు ఇంజినుపై పరిమితికి మించి మహిళా కూలీలు ప్రయాణం సాగిస్తున్న ఈ దృశ్యం ప్రొద్దుటూరు రింగు రోడ్డులో సోమవారం ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. వీరందరూ పంట నూర్పిళ్ల పనులకు వెళ్తున్నట్లు సమాచారం.

source:eenadu

కొందరి అవసరాలు మరికొందరికి ఇబ్బందిగా మారుతాయి. చిత్తూరు నుంచి గంగాధర నెల్లూరు వెళ్లే మార్గంలో ఒక ద్విచక్ర వాహనంపై నలుగురు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ కనిపించారు.

source:eenadu

ఖమ్మం పోలీసు పరేడ్‌ మైదానంలో పోలీసు అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు ఉదయం సుమారు 9 గంటల వరకు పరీక్షలు పూర్తవుతున్నాయి. బుధవారం ఓ అభ్యర్థి 9.25 గంటలకు మైదానానికి చేరుకున్నారు. అప్పటికే పరుగు ముగిసింది. అయినా ఒకే ఒక్కడికి పరుగు పరీక్ష నిర్వహించారు. source:eenadu

కేరళలోని తిరువనంతపురం తీరంలో చేపల వల చుట్టుకొని ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలాన్ని సముద్రంలోకి తిరిగి పంపిస్తున్న మత్స్యకారులు.

source:eenadu

ప్రయాణికులను తరలించేందుకు వీలుగా ఇజ్రాయెల్‌కు చెందిన అంకుర సంస్థ ‘ఏఐఆర్‌’ తయారు చేసిన గాల్లో ఎగిరే ఎలక్ట్రిక్‌ వాహనం. బుధవారం బీర్‌షెబా విమానాశ్రయంలో దీన్ని పరీక్షించారు.

source:eenadu

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేటలోని పాఠశాలలో విధులపట్ల ఆసక్తి చూపని ఉపాధ్యాయుడి కారణంగా అక్కడ ఐదో తరగతి పిల్లలకూ అ..ఆ..లు రాని దుస్థితి. దీంతో తల్లిదండ్రులు ఆటోల్లో పిల్లలను 4 కి.మీ. దూరాన ఉన్న మల్లికార్జునపల్లి ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home