చిత్రం చెప్పే విశేషాలు!
(24-12-2022/1)
గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో ఫుట్‌బాల్ బంతులతో క్రిస్మస్ ట్రీ.
source:Eenadu
వరంగల్ నగరంలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు జోరుగా సాగుతున్నాయి. శుక్రవరం చర్చిలు, పలు చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు కేకులు కోశారు. పాఠశాలల్లో విద్యార్థులు యేసు క్రీస్తు జీవిత చరిత్రను తెలియజేసే విధంగా నృత్యాలు చేశారు.
source:Eenadu
మాదాపూర్ హైటెక్స్‌లో పిల్లల ప్రపంచం కొలువుదీరింది. పుస్తకాలు, దుస్తులు, బొమ్మలు ఇలా అన్ని వస్తువులు ఒక్కచోట అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శన మూడు రోజులపాటు కొనసాగనుంది.
source:Eenadu
చిలుకానగర్‌లో గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వాహనదారుడు శుక్రవారం గుంతలో పడ్డారు.
source:Eenadu
కూకట్‌పల్లి సర్కిల్‌లో పలు ప్రాంతాల్లో గోడలపై వేసిన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ఎడ్ల బండ్లు, సంక్రాంతి ముగ్గులు, బహిరంగ మల, మూత్ర విసర్జన వద్దని, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదమని తెలిపే చిత్రాలు అవగాహన కల్పిస్తున్నాయి.
source:Eenadu
తెలుగు రాష్ట్రాల్లోని రచయితల్ని, కళాకారుల్ని ప్రభుత్వం పట్టించుకోవాలని అనకాపల్లికి చెందిన తెలుగు భాషాభిమాని సంజీవరావు విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రచయితలను, కళాకారులను గుర్తించి సత్కరించాలని కోరారు.
source:Eenadu
తెలుగు రచయితల మహాసభల్లో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తున్న పోలండ్ దేశానికి చెందిన పోలండ్ బుజ్జి.
source:Eenadu
కేటీఆర్ ఇంట్లో శారీరక కసరత్తులు చేస్తున్న ఫొటోను కేటీఆర్ ట్యాగ్ చేయగా.. దానికి నెటిజన్ల నుంచి స్పందన వచ్చింది. ‘మీరు సినిమాల్లోకి రావాలి. యాక్షన్ సినిమాలో నటించాలి. మహేశ్‌బాబు సినిమాలో పవర్‌ఫుల్ పాత్ర చేయాలి’ అంటూ పలువురు ట్వీట్స్ చేశారు.
source:Eenadu
ఎల్బీనగర్ పైవంతెనపై ఒకవైపు (హయత్‌నగర్) ప్రయాణించేందుకు మాత్రమే వీలుంది. కొందరు వాహనదారులు దీనిపై ప్రమాదకరంగా రాంగ్‌రూట్లో వెళ్తూ.. ఇతరులనూ ఆపదలోకి నెడుతున్నారు..
source:Eenadu
శిల్పారామంలో.. బెంగళూరు నుంచి వచ్చిన నాట్యగురువు బాలావిశ్వనాథ్ శిష్యబృందం ప్రదర్శించిన దశావతార నృత్యాంశం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అనంతరం డా.వినీలారావు బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం నయనానందకరంగా సాగాయి.
source:Eenadu