చిత్రం చెప్పే విశేషాలు!

(28-12-2022/1)

ఎగువ అస్సాంలోని నాలుగు జిల్లాలను మంగళవారం ఉదయం వడగండ్లవాన కుదిపేసింది. 132 గ్రామాల పరిధిలోని దాదాపు 4500 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, సుమారుగా 18వేల మంది నిరాశ్రయులయ్యారని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన శాఖ అధికారులు తెలిపారు.

source:eenadu

మంగళవారం రాత్రి దిల్లీ విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు.

source:eenadu

కొల్లాపూర్‌ మండలం సోమశిల వద్ద కృష్ణానదిలో పర్యటకుల సంఖ్య పెరుగుతోంది. బోట్ల నిర్వాహకులు ప్రతి ఒక్కరికి రక్షణ జాకెట్లు అందజేసి తిప్పాల్సి ఉన్నా.. కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో పట్టింపు కనిపించడం లేదు. ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ సోమశిల వద్ద క్లిక్‌మనిపించింది.

source:eenadu

ఇంటింటికి రేషన్‌ పంపిణీ చేసే ఎండీయూ వాహనం ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని ఓ ఇటుకల బట్టీ వద్ద కనిపించింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో వాహనం కంతులు కట్టలేకపోతున్నాం.. అందువల్లే ఇతర పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

source:eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదవలస పంచాయతీ పెదలంక గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. కాలువలు వర్షాకాలంలో అవి పొంగి, కాలిబాట బురదమయమవుతోంది. పిల్లలు మంగళవారం పాఠశాలకు వెళ్లడానికి తిప్పలు పడుతుంటే సర్పంచి కృష్ణవంశీ సాయం చేశారు. 

source:eenadu

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లక్ష్యంగా మంగళవారం దిల్లీలోని కర్తవ్య మార్గ్‌లో మోటార్‌ సైకిల్‌ రైడ్‌ విన్యాసంలో పాల్గొన్న బీఎస్‌ఎఫ్‌ మహిళా విభాగానికి చెందిన బృందం.

source:eenadu

యాప్స్‌ ద్వారా గమ్యస్థానాలకు చేర్చే ద్విచక్రవాహనదారుడు.. తాను శిరస్త్రాణం ధరించడంతోపాటు తన బైక్‌పై ఎక్కే ప్రయాణికుల సౌకర్యార్థం ఇలా హెల్మెట్లను సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆర్కేమఠ్‌ దారిలో కనిపించింది.

source:eenadu

విశాఖ అందాలను చూడడానికి అక్కడికొస్తున్న సందర్శకులంతా ఈ రేవును చూసి విస్తుపోతున్నారు. మనం చేపలరేవుకు వచ్చామా... డంపింగ్‌ యార్డుకొచ్చామా.. అని సందేహ పడుతున్నారు. ఇక్కడి చెత్తను తొలగించక పోవడంతో పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home