చిత్రం చెప్పే విశేషాలు!
(29-12-2022/1)
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పలుచోట్ల ప్రకృతి గీసిన చిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. మంచు తెరల మాటున పచ్చని పైరు, పొడవైన కొబ్బరిచెట్ల మధ్య ఉదయిస్తున్న సూర్యుణ్ని కమ్ముతున్న మంచుతెరలు, వాటిని చీల్చుకుని వస్తున్న సూర్యకిరణాలు కట్టిపడేస్తున్నాయి.
source:eenadu
తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు, గంజాయి బ్యాచ్‌కు అడ్డాగా మారింది. ఈ భవనాలు భాగంగా రెండో విడత పనులు జరుగుతుండడంతో విద్యార్థులను ఎదురుగా ఉన్నవారి పాత భవనంలో ఏడాదిగా తరగతులు నడుస్తున్నాయి.
source:eenadu
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌కు వెళ్లే మార్గంలో చెత్తను భారీగా డంపింగ్ చేస్తున్నారు. అధికారులే చెత్తను తరలించలేక నిప్పు అంటించారనే ఆరోపణలు రావడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా ఇక్కడ చెత్త పోగుచేయడం ఆగలేదు.
source:eenadu
ఒకే వాహనంపై 42 చలాన్లు ఉండటాన్ని భిక్కనూరు పోలీసులు బుధవారం గుర్తించారు. ఎస్సై ఆనంద్‌గౌడ్ వివరాల ప్రకారం.. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎమ్‌హెచ్ 49బీబీ9911 కారుపై రూ.43,470 జరిమానా ఉండటాన్ని గుర్తించి.. కేసు నమోదు చేస్తామని చెప్పడంతో యజమాని మొత్తం కట్టేశారు.
source:eenadu
భువనగిరి పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన రామారావు నివాసంలో మాత్రం చెట్టుకు చోటిస్తూ ఇలా నిర్మాణం చేపట్టి పచ్చదనం ప్రాధాన్యం చాటారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ నివాసాన్ని చూసి అబ్బుర పడుతూ స్ఫూర్తి పొందుతున్నారు. source:eenadu
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఈ విద్యా సంవత్సరంలో అధ్యాపకుల నియామకంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో ఎంపీసీ గ్రూపులో మిగిలిన ఒకే విద్యార్థిని.. ఆమెకు బోధిస్తున్న అధ్యాపకురాలిని చిత్రంలో చూడవచ్చు.
source:eenadu
గతంలో ఎన్నడూ లేని విధంగా పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవడానికి కూడా అన్నదాతలు అనేక ఇబ్బందులుపడాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం రైల్వేస్టేషన్‌లో వ్యాగన్‌లు ఆగే ఫ్లాట్‌ఫాంలపై పలువురు రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు.
source:eenadu
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట వేములమ్మ దేవాలయంలో 8వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం వెలుగులోకి వచ్చింది. దేవాలయం రాతిపై ఉన్న శాసనాన్ని, అక్కడి విగ్రహాలను గ్రామానికి చెందిన జి.వి.నారాయణరెడ్డి అచ్చులు తీసి పురావస్తుశాఖకు పంపారు. source:eenadu