చిత్రం చెప్పే విశేషాలు!
(30-12-2022/1)
మహబూబూబ్‌నగర్ మిడ్జిల్ మండలం బోయినిపల్లి గ్రామ శివారులోని పొలంలో విరిగిపోయి అంత్యత ప్రమాదకరంగా మారిన ఈ స్తంభం విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. స్తంభం విరిగి తొమ్మిది నెలలు గడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
source:eenadu
మంగళగిరి ప్రధాన రహదారి పక్కనే ఉన్న పార్క్ రోడ్డులో మద్యం తాగరాదు..నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పక్కనే మందుబాబులు మద్యం తాగడం గమనార్హం. పగలు రాత్రి ఇక్కడ ఇవే దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి.
source:eenadu
ఈ ఏడాది మార్చి 26న రాత్రి భాకరాపేట ఘాట్‌లోని మలుపులో బస్సు అదుపుతప్పి లోయలో పడి పదిమంది మృతిచెందిన విషయం తెలిసిందే. తరువాత అధికారులు 165 మీటర్ల పొడవున, ఐదు అడుగుల ఎత్తులో రక్షణ గోడ, గ్రిల్స్ ఏర్పాటు చేసి, రేడియం స్టిక్కర్లతో సూచికలు నెలకొల్పారు.
source:eenadu
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ(ఉత్తరాఖండ్)ని స్థాపించారు. ఇది నవంబరు 25, 2022 నాటికి 175 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలోని టంకశాలలో దేశంలోనే మొదటిసారిగా రూ.175ల నాణేన్ని విడుదల చేశారు.
source:eenadu
జమ్మలమడుగు నుంచి ఆళ్లగడ్డ పట్టణానికి వెళ్లే పెద్దముడియం-సుద్దపల్లె రహదారి దెబ్బతినడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కేంద్ర రహదారి (సీఆర్‌ఎఫ్) నిధులు రూ.15 కోట్లు మంజూరు కావడంతో పనులు ప్రారంభించేందుకు తొలుత తారు తొలగించి అలాగే వదిలేశారు. source:eenadu
గగనతలంలో వేగంగా విహరించే అరుదైన విహంగం ఎల్లో వాటిల్ లాప్వింగ్(పసుపు చిటవ). మనదేశంతో పాటు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో అధికంగా ఉంటాయి. కొల్లేరులో ఇవి 550 వరకు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
source:eenadu
ముళ్ల పొదల మధ్య, మట్టికుప్పల నడుమ కనిపిస్తున్న ఈ ఆటోలు కడప నగరపాలక సంస్థకు చెందినవి. 12వ ఆర్థిక సంఘం నిధులతో చెత్త సేకరణ, తరలింపు కోసం సుమారు రూ.3 కోట్లు వ్యయం చేసి కొనుగోలు చేశారు. నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో వాహనాలు తుక్కుగా మారాయి.
source:eenadu
తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరున్న కొత్త బైకును అసలు నంబరే లేని మరో బైక్‌పై ఉన్న యువకుడు ఇలా కాలుతో నెట్టుతూ పెట్రోల్ బంక్ వరకు తీసుకువెళ్లాడు. కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్ద కనిపించిందీ దృశ్యం.
source:eenadu