చిత్రం చెప్పే విశేషాలు!
(02-01-2023/1)
‘అధికారంలోకి రాగానే మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఫైవ్‌స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం.. మాట తప్పం.. మడమ తిప్పం’ అంటూ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రచారం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపులో ఏర్పాటు చేసిన లోగోలో మద్య నియంత్రణ ఉండటం గమనార్హం.
source:eenadu
కత్తెర పురుగు మొక్కజొన్న రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి రైతులు మందు పురుగుపై ప్రభావం చూపేలా సీసాల్లో మందును నింపి నేరుగా మొవ్వులో పోస్తున్నారు. కత్తెర పురుగూ పూర్తిగా నివారణ అవుతోందని రైతులు చెబుతున్నారు.
source:eenadu
భద్రాచలం-కూనవరం మార్గంలో తోటలు పర్యటకులను అలరిస్తున్నాయి. నెల్లిపాక, తోటపల్లి మధ్య కంది తోటలు పసుపు రంగులో పూలవనాన్ని తలపిస్తుండడంతో పర్యటకులు ఆ అందాలను సెల్ఫోన్లలో బంధిస్తున్నారు.
source:eenadu
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది పర్యాటకులు శనివారం సాయంత్రానికే పాడేరు చేరుకున్నారు. కొందరు రాత్రికే వంజంగి చేరుకోగా, మరికొందరు ఆదివారం వేకువజామున కొండపైకి చేరుకుని నూతన సంవత్సర సంబరాలు జరుపుకొన్నారు.
source:eenadu
గార్లదిన్నెలో రైల్వే గేటు మీదుగా పలు గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. రైలు వచ్చే సమయంలో గేటు వేస్తున్నా.. కొందరు ఆగకుండా దూరి, వాహనాలను తోసుకుంటూ ప్రమాదమని రైల్వే సిబ్బంది హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు.
source:eenadu
తాడిమర్రి మండలంలోని మేడిమాకులపల్లి రైతు యర్రగంగు వెంకటరాముడు దానిమ్మ టన్ను రూ.1.16 లక్షలకు విక్రయించారు. ధర్మవరం వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ సీజన్లో రూ.లక్షకుపైగా ధర పలకడం ఇదే ప్రథమం. మొదటి కోతలోనే అధిక ధర లభించడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
source:eenadu
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామ ప్రజలకు మాత్రం ఆ అవసరమే లేదు. గ్రామంలో చెరువులో ఎరుపు కలువలు విరబూసి కనువిందు చేస్తున్నాయి. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే మార్గం పక్కనే ఈ కొలను ఉండటంతో ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
source:eenadu
పాల నురగలాంటి మంచు దుప్పటి పరుచుకున్న దృశ్యం పద్మనాభం మండలం అనంతుని గిరిపై నుంచి కనిపించింది. ఆ మంచు తెరలను చీలుస్తూ సూర్యుడు ఉదయించడం ప్రకృతి ప్రేమికులను మైమరిపింపచేసింది.
source:eenadu