చిత్రం చెప్పే విశేషాలు!
(03-01-2023/1)
సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ (Machael). దివ్యాంశ కౌశిక్ కథానాయిక. రంజిత్ జయకోడి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది.
source:Eenadu
ఏపీ పోలీసులు కొత్తగా 19 టయోటా ఫార్చ్యూనర్ వాహనాలను కొనుగోలు చేశారు. వీటిలో 17 వాహనాలు నలుపు, 2 వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి. ఈ వాహనాలు ఎవరి కోసం కొనుగోలు చేశారనే దానిపై పూర్తి గోప్యత పాటిస్తున్నారు. సీఎం జగన్ కోసమే కొన్నారన్న ప్రచారం జరుగుతోంది.
source:Eenadu
బాలానగర్ ప్రధాన రహదారి హనుమాన్ కమాన్ పక్కన శోభన సెంటర్ బస్టాపులో ఆటోలు తిష్ఠ వేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు రోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి.
source:Eenadu
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు భారాసలో చేరిక సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంతో తెలంగాణ భవన్ వద్ద కోలాహలం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏపీ నాయకులకు సాదర స్వాగతం పలికారు. ఫ్లెక్సీలతో ఆ మార్గమంతా గులాబీమయమైంది.
source:Eenadu
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సౌత్‌లేక్ టాహోవ్‌లో హిమపాతం కారణంగా కారుపై పేరుకున్న మంచును తొలగిస్తున్న స్థానికులు.
source:Eenadu
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కర్నూలు వెంకటరమణ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో వేంకటేశ్వరస్వామి పద్మావతి అమ్మవార్లకు భక్తుల నుంచి సేకరించిన విరాళాలు రూ.16.50 కోట్లతో తయారు చేసిన బంగారు కవచం, ఆభరణాలు సోమవారం అలంకరించారు.
source:Eenadu
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దిల్లీ గోల్ మార్కెట్‌లోని బాలాజీ ఆలయంలో భారత ప్రధాన న్యాయ మూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
source:Eenadu
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై అన్నోజిగూడ వద్ద డివైడర్ మధ్య ఉన్న చిన్న సందుల్లోంచి ద్విచక్ర వాహనదారులు దాటుతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వీరికి ప్రమాదం పొంచి ఉంది.
source:Eenadu
కృష్ణా జిల్లా అవనిగడ్డ అయిదో వార్డుకు చెందిన కొండవీటి రామ్‌ప్రసాద్ పెరట్లో కాచిన తెల్ల వంకాయలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తన కుమారుడు సందీప్ ద్వారా ఆన్‌లైన్‌లో బెంగళూరు నుంచి తెప్పించిన విత్తనాలు నాటడంతో ఈ మొక్కలు మొలచినట్లు రామ్‌ప్రసాద్ చెప్పారు.
source:Eenadu