చిత్రం చెప్పే విశేషాలు!
(04-01-2023/1)
ఏ క్షణంలో తీవ్రవాదులు దాడి చేసినా.. ఏదైనా ఉపద్రవం ముంచుకొచ్చినా ఎదుర్కొనేందుకు మెదక్‌లోని ప్రఖ్యాత సీఎస్‌ఐ చర్చిలో ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. 50 మంది ఆక్టోపస్ బృంద సభ్యులతో పాటు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
source:eenadu
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని నవాబు చెరువులో చెట్లపై కొంగలు చేరి సందడి చేస్తున్నాయి. చెరువులో జలకళ ఉండటంతో చేపల వేటకు వస్తున్నాయి. చెట్టుపై వందల కొంగలు వాలడంతో అవి చెట్టుకు పూసిన పువ్వుల వలే కనిపిస్తూ.. చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
source:eenadu
హనుమకొండలోని కాకతీయ జూ పార్కులో రెండు పులులను తీసుకొచ్చి.. దేవా, స్రవంతి పేర్లు పెట్టారు. అనారోగ్యంతో స్రవంతి మృతి చెందింది. 2021 సెప్టెంబరులో మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గాయాలతో ఉన్న ఆడ చిరుతను జూకు తీసుకొచ్చి ఖైరా అని నామకరణం చేశారు.
source:eenadu
అమరావతి రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సామగ్రిని సమకూర్చారు. ప్రభుత్వం మారాక పనులు నిలిచిపోయి సీడ్ యాక్సిస్ రోడ్లు, దాని అనుబంధ రోడ్లలో చాలా చోట్ల నిర్మాణ సామగ్రిని ఉంచడంతో వాటి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచి చెట్లవుతున్నాయి.
source:eenadu
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు చుట్టూ ఏమాత్రం కనీస రక్షణ లేదు. ఎవరైనా ఆకతాయిలు ఆక్సిజన్ పైపులు తిప్పితే పెనుప్రమాదం జరిగి వందల మంది చంటిబిడ్డల ప్రాణాలతో ఆటలాడుకున్నట్లే అవుతుంది.
source:eenadu
వైకాపా రంగులు భవనాల నుంచి చెట్లకు వ్యాపించాయి. గతేడాది సెప్టెంబర్ 23న సీఎం జగన్ కుప్పం పర్యటన నేపథ్యంలో వందలాది చెట్లకు వైకాపా రంగులు వేశారు. నాటి నుంచి నేటికీ ఆ రంగులు సీఎం పర్యటనకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
source:eenadu
భారత్ జోడో యాత్రలో భాగంగా దిల్లీ శివారులోని గాజియాబాద్‌లో మంగళవారం తన సోదరి ప్రియాంకను ఆటపట్టిస్తున్న రాహుల్ గాంధీ.
source:eenadu
హైదర్‌గూడ తెలుగు అకాడమీ ఎదురుగా చెట్టు మీద వాలే క్రమంలో పక్షి మాంజాకు చిక్కుకుంది. ఓ వ్యక్తి కర్రతో దారాన్ని తొలగించడంతో ప్రాణాపాయం తప్పింది.
source:eenadu