చిత్రం చెప్పే విశేషాలు!
(05-01-2023/1)
గత ఏడాది నవంబరు 30న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మదనపల్లె-పుంగనూరు రహదారిపై గుంతలుగా ఉన్న దారులపై ఆర్‌బీ శాఖ అధికారులు తారు వేసి మరమ్మతు చేశారు. పర్యటన తరువాత వారం రోజులకే వర్షాలకు వేసిన తారు లేచిపోయి కంకర తేలింది.
source:eenadu
చింతపల్లి మండలం చిన్నగెడ్డ, కృష్ణాపురం ప్రాంతాల్లో పైనస్ రాక్స్‌బర్గయ్ అనే వనాలు పెరుగుతున్నాయి. వీటి కలప కరెన్సీ నోట్ల తయారీలో వినియోగిస్తారు. ఎత్తుగా పెరిగే ఈ చెట్ల పూలు కూడా భిన్నంగానే ఉంటాయి. వీటిని ఇళ్లలో రంగులు వేసుకుని అలంకరణకు వినియోగిస్తారు.
source:eenadu
గుంటూరు జీజీహెచ్‌లో రోగులకు సేవాలందించే చక్రాల కుర్చీలను చెత్త తరలించేందుకు వాడుతున్నారు. ఆస్పత్రిలోని ప్రమాదకరమైన సర్జికల్ చెత్త తరలింపునకు వీటిని వాడుతుండడం గమనార్హం. వీటిలోనే రోగులు కూర్చుని వెళ్లాల్సి రావడంతో కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
source:eenadu
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రదేశం.. పవిత్ర జలాలు, మట్టితో వేదమంత్రోచ్ఛారణల మధ్య గతంలో ఓ వెలుగు వెలిగేది.. అధికారుల నిర్లక్ష్యంతో కంపచెట్లతో కమ్ముకుపోయింది. వెళ్లడానికి దారుల్లేకుండా మూసుకుపోయి.. ఇలా పొదలమాటున ఉంది.
source:eenadu
విశాఖ ఏయూ మైదానంలో నిర్వహిస్తున్న అఖిలభారత డ్వాక్రాబజార్‌లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి మమతకుమారి, దీపాశర్మలు తీసుకొచ్చిన ఎండిన పుష్పాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. రావిఆకులు, మొక్కజొన్న కంకులు వంటి వాటితో బొకేలుగా తయారుచేస్తున్నారు.
source:eenadu
తాటిచెట్టు తలభాగం విరిగి ఎండిపోగా చిలుకలు పైభాగంలో గూడును ఏర్పాటు చేసుకున్నాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ కరకట్టమీద శ్రీకాకుళం వద్ద కనిపించిన ఈచిత్రం చూపరులను ఆకట్టుకుంది.
source:eenadu
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు భారీగా వస్తున్నారు. బుధవారం పది వేల మందికి పైగా వచ్చారు. మినీ ట్రైన్‌లో చక్కర్లు కొడుతూ సరదాగా గడుపుతున్నారు.
source:eenadu
బంధాలు, బంధుత్వాలు కనుమరుగవుతున్న నేటి కాలంలో రెండు వేర్వేరు జాతుల మూగజీవాల స్నేహం ముచ్చటగొలుపుతోంది. వై.రామవరం మండలం తలకజీడిలో కుక్క, కోతి ఎన్నోరోజులుగా స్నేహం చేస్తున్నాయి. రెండూ కలిసి హాయిగా నిద్రిస్తున్నాయి.
source:eenadu