చిత్రం చెప్పే విశేషాలు!
(06-01-2023/1)
రంగురంగుల చీరల తోరణాలతో కనువిందు చేస్తున్న ఈ వంతెన నంద్యాల- కర్నూలు మార్గంలోని కుందూనదిపై ఉంది. నదిలో దుస్తులు శుభ్రం చేసే రజకులు ఉతికిన చీరలను ఆరబెట్టేందుకు ఇలా వంతెనపై తోరణాల్లో కడుతున్నారు. ఈ దృశ్యం ప్రయాణికులు, స్థానికులను ఆకట్టుకుంటోంది.
source:eenadu
టమోట బాక్సు(25 కిలోలు) శంషాబాద్ మార్కెట్లో మరీ తక్కువగా రూ.120 పలికింది. చేసేది లేక శంషాబాద్ చినగోల్కొండకు చెందిన రైతు సుధాకర్‌రెడ్డి తెచ్చిన పంటను పారబోస్తున్న చిత్రమిది.
source:eenadu
బేగంబజార్‌లో నిర్మించిన చేపల మార్కెట్ భవనమిది. ప్రారంభించి నాలుగు నెలులు కావొస్తున్నా.. మడిగలు కేటాయించకపోవడంతో వ్యాపారులు రోడ్డుపైనే చేపలు అమ్ముతున్నారు. దీంతో బురద, వ్యర్థాలు, దుర్గంధంతో ఆ ప్రాంతమంతా అధ్వానంగా మారుతోంది.
source:eenadu
చెంగిచర్ల ఎఫ్‌సీఐ గోదాం రోడ్డులో గురువారం గ్యాస్, ఇంధన ట్యాంకర్లు నిలిచిపోవడంతో ఓ వైపు రోడ్డంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆయిల్, గ్యాస్ కేంద్రాలు వాహనాలతో నిలిచి ఉండటంతో ట్యాంకర్లు రోడ్డుమీదే నిలపాల్సి వచ్చిందని చోదకులు చెప్పారు.
source:eenadu
కార్మికుల ప్రాణాలకు హాని కలగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా.. భద్రతా ప్రమాణాలు పాటించకుండా సిబ్బంది పైపులైన్లు, మ్యాన్‌హోల్స్, డ్రైనేజీ శుభ్రం చేసినట్టు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని జలమండలి అధికారులు బాలానగర్‌లో గోడలపై ప్రింట్ వేయించారు.
source:eenadu
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం అలంకారోత్సవం చేపట్టారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రబంధ పఠనాలతో పాటు నరసింహస్వామిని చిన్ని కృష్ణుడిగా తీర్చిదిద్ది తిరువీధి సేవోత్సవం నిర్వహించారు. రాత్రివేళ కాళీయ మర్దనుడి అలంకరణతో సేవాపర్వం జరిపారు.
source:eenadu
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్.. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తల్లి జ్యోతి కోరిక మేరకు సిరిచందన పట్టు, వెండి యార్న్‌తో చీర తయారు చేశారు. 90 గ్రాముల వెండితో, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల పన్నా వేసిన 600 గ్రా. చీరకు రూపకల్పన చేశారు.
source:eenadu
తలకు శిరస్త్రాణం లేదు..రహదారి భద్రత పైఅస్సలు పట్టింపులేదు. ఊహించని ప్రమాదం ఎదురవ్వకముందే అప్రమత్తం కావల్సిన తీరును ఈ చిత్రం గుర్తుచేస్తోంది. కాకినాడ నగరంలోని మెయిన్‌రోడ్డులో తారసపడిన దృశ్యమిది.
source:eenadu