చిత్రం చెప్పే విశేషాలు!
(07-01-2023/1)
బర్కత్‌పుర నుంచి ఫీవర్ ఆసుపత్రికి వెళ్లే రోడ్డులో వాహనంపై ప్రయాణిస్తున్నారు. అడ్డుగా ఏదైనా బండి వచ్చినా,గుంతల్లో కుదుపులకు వారు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
source:Eenadu
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రిలో శుక్రవారం వటపత్ర శయనుడి రూపంలో నరసింహస్వామి దర్శనమిచ్చారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం అలంకార సేవోత్సవ పర్వాన్ని ఆలయ ఆచారంగా చేపట్టారు.వేద, మంత్రోచ్చరణల మధ్య అలంకారోత్సవం కొనసాగింది.
source:Eenadu
బాలానగర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమిది. ఇక్కడికి నిత్యం ఎంతోమంది గర్భిణులు వస్తుంటారు. గల్లీ మొత్తం వాహనాలతో నిండిపోయింది. అత్యవసర పరిస్థితి ఏర్పడితే కనీసం అంబులెన్సు రాలేని పరిస్థితి. దీంతో ఆ వాహనాన్ని పక్కన గల్లీలో పార్కింగ్ చేస్తున్నారు.
source:Eenadu
కరోనా సమయంలో డాక్టర్లు, పోలీసులు, బల్దియా సిబ్బంది చేసిన సేవలకు గౌరవంగా కూకట్‌పల్లి జాతీయ రహదారిపై వారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. నిర్వహణ లేక ఇలా లైట్లు పోయి అక్షరాలూ ఊడి పోయి ఇలా కనిపిస్తున్నాయి.
source:Eenadu
తెల్లాపూర్ పురపాలక పట్టణంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వ్యవసాయంలో పాలు పంచుకోవడానికి ఆసక్తి చూపారు. స్థానికంగా వరి నాట్లు వేసే విధానంలో రైతుతో మాట్లాడి నాట్లు వేశారు.10 మంది ఉద్యోగులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మడిలో నాట్లు వేశారు.
source:Eenadu
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎర్రబంగారానికి అధిక ధర పలికింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రావిచెట్టు తండాకు చెందిన తేజావత్ రాములు 2 క్వింటాళ్ల దేశీ రకం మిర్చిని వ్యాపారులు అన్నపూర్ణ ట్రేడర్స్ ద్వారా క్వింటాలుకు రూ.80,100 చొప్పున కొనుగోలు చేశారు.
source:Eenadu
అది మోటారు సైకిల్. సామర్థ్యం ఇద్దరు. కానీ దానిపై ప్రయాణిస్తున్నది మాత్రం మొత్తంగా ఐదుగురు. అందులోనూ ముగ్గురు చిన్నారులే. బతుకు పోరులో ఓ కుటుంబం సాగిపోతుంది. సామగ్రితో పాటు పిల్లాపాపలతో ఊరూరా తిరుగుతూ గ్యాస్ పొయ్యిలను మరమ్మతులు చేస్తున్నారు.
source:Eenadu
తెలంగాణ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్..హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ‘హింద్ కేసరి 2022’ కుస్తీ పోటీలు శుక్రవారం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ప్రారంభించారు. పలు రాష్ట్రాల పహిల్వాన్లు హోరాహోరీగా తలపడ్డారు
source:Eenadu