చిత్రం చెప్పే విశేషాలు!
(07-01-2023/2)
హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో పెట్ కార్నివాల్ నిర్వహించారు. కార్యక్రమానికి నగరవాసులు తమ పెంపుడు జంతువులు, పక్షులతో ఉత్సాహంగా హాజరయ్యారు. ఇక్కడ పెంపుడు జంతువులకు కావాల్సిన వస్తువులను విక్రయించడంతో పాటు వాటికి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
source:Eenadu
విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో ‘స్ఫూర్తి 2023’ పేరుతో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, ర్యాంప్‌వాక్‌తో పాటు డోలు వాయించి సందడి చేశారు.
source:Eenadu
లాస్‌వెగాస్‌లో నిర్వహిస్తున్న సీఈఎస్ టెక్ షోలో ఎల్జీ సంస్థ పారదర్శక టీవీని ప్రదర్శించింది. గాజులా కనిపిస్తున్న ఈ టీవీని చూసి సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు.
source:Eenadu
రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లో తెర మీద కనిపించబోయే ‘అమిగోస్’ ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
source:Eenadu
కాంగ్రెస్ చేపట్టిన భారత్‌జోడో యాత్ర హరియాణాలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శనివారం ప్రియాంక గాంధీ పెంపుడు శునకం రాహుల్ గాంధీతో పాటు నడిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
source:Eenadu
సినీనటి శృతిహాసన్ హైదరాబాద్ ఖాజాగూడలోని ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
source:Eenadu
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రదుకాణ ప్రారంభోత్సవంలో సినీ నటీమణులు నేహాశెట్టి, అనసూయ పాల్గొని సందడి చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
source:Eenadu
దక్షిణ కొరియాలోని హువాచియాన్‌లో గడ్డకట్టిన నది ఉపరితలంపై ‘ట్రౌట్ క్యాచింగ్ కాంటెస్ట్’ నిర్వహించారు. ఇందులో భాగంగా పోటీదారులు గడ్డకట్టిన నది ఉపరితలంపై రంధ్రాలు చేసి.. అందులో నుంచి గాలాలు వేసి చేపలు పడుతుంటారు.
source:Eenadu