చిత్రం చెప్పే విశేషాలు!
(09-01-2023/1)
హరితహారం పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం ఆవరణంలో మొక్కలు నాటారు. ఆ మొక్కలకు రక్షణగా పాడైన టైర్లను ఏర్పాటు చేయడం ఆకట్టకుంటోంది.
source:eenadu
మిద్దె పంట.. ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తోందని చెబుతున్నారు ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన తాండ్ర పద్మ. మూడేళ్లుగా పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, అలంకార మొక్కలను తమ మిద్దెపై పెంచుతున్నామని తెలిపారు.
source:eenadu
ఈ చిత్రాన్ని చూస్తే ద్విచక్రవాహనంపై చిన్నపాటి దుకాణమే వెళ్తున్నట్లుంది కదూ. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం పస్రా వద్ద జాతీయ రహదారిపై ఓ వ్యక్తి ఇలా బండిపై నిండుగా స్టీల్ గిన్నెలు, వస్తువులు పెట్టుకుని వెళ్తుండటం అందరినీ ఆకర్షించింది.
source:eenadu
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సినిమా ‘అవతార్- ది వే ఆఫ్ వాటర్’. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇండియాలో రికార్డుస్థాయిలో రూ. 454 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని చిత్ర బృందం తెలిపింది.
source:eenadu
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ గాలి పటాల ఉత్సవాల్లో ప్రదర్శించిన భారీ పతంగి.
source:eenadu
విశాఖపట్నం ఆనందపురం సమీప గుడిలోవ విజ్ఞాన విహార ఆశ్రమ పాఠశాలలో ఆదివారం విద్యార్థుల సాహస కృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
source:eenadu
సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఇదే రోజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెదేపా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్.. 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు... దేశ రాజకీయ యవనికపై ఓ తిరుగులేని.. చెరిగిపోని చిత్రం!
source:eenadu
చిరంజీవి హీరోగా, కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ సినిమాలోని ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ ‘సముద్రం లోతులు చూసి, సముద్రాన్ని శాసించే స్థాయికి వెళ్లినవాడే మెగాస్టార్.. మా వాల్తేరు వీరయ్య’ అని ట్వీట్ చేశారు.
source:eenadu