డిక్షనరీల్లో చేరిన కొత్త పదాలివీ!
ఏటా వివిధ డిక్షనరీల్లో కొత్త కొత్త పదాలు, వాటి అర్థాలు వచ్చి చేరుతుంటాయి. ఈ ఏడాది కూడా కొన్ని పదాలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో కొన్ని.. వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం...
Image: Pixabay
ఇన్‌ఫ్లూయెన్సర్(Influencer) - ప్రముఖ వ్యక్తి
ఇంటర్నెట్, సోషల్‌మీడియా ద్వారా సామాజిక అంశాలు, వ్యాపార ఉత్పత్తులపై నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించే వ్యక్తి. (ఆక్స్‌ఫర్డ్)
Image: Unsplash
సైడ్ హజల్(Side hustle) - పార్ట్ టైం ఉద్యోగం
ఒక ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం పార్ట్ టైం ఉద్యోగం చేయడం.(ఆక్స్‌ఫర్డ్)
Image: Unsplash
పంప్‌కిన్ స్పైస్(Pumpkin spice)
‘పంప్‌కిన్ పై’ డజర్ట్ తయారీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు. (ఆక్స్‌ఫర్డ్)
Image: Unsplash
టెర్ఫ్(TERF) - ట్రాన్స్-ఎక్స్‌క్లూజనరీ ర్యాడికల్ ఫెమినస్ట్
ట్రాన్స్‌జెండర్ హక్కులను కాకుండా కేవలం మహిళల హక్కులు, సమస్యలపై గళమెత్తే స్త్రీవాది. (ఆక్స్‌ఫర్డ్)
Image: Unsplash
ఎన్బీ(Enby)
స్త్రీ, పురుషుల్లో ఏ ఒక్క లింగానికి చెందని వారు. (ఆక్స్‌ఫర్డ్)
Image: Unsplash
ఫస్ట్ జెంటిల్‌మ్యాన్(First gentleman)
దేశాధ్యక్షురాలి భర్త / జీవిత భాగస్వామి (ఆక్స్‌ఫర్డ్)
Image: Prathiba patil
యీట్(Yeet)
ఆశ్చర్యాన్ని, అంగీకారాన్ని వ్యక్తపర్చేందుకు ఉపయోగించే పదం.(మెరియమ్ వెబ్‌స్టర్)
Image: Unsplash
డంబ్‌ఫోన్ (Dumbphone)
ఇంటర్నెట్, ఆధునిక ఫీచర్లేమీ లేని బేసిక్ ఫోన్.(మెరియమ్ వెబ్‌స్టర్)
Image: Pixabay
సబ్‌వేరియంట్(Sub variant)
ఒకే వేరియంట్‌కు చెందిన రెండు.. అంతకంటే ఎక్కువ విలక్షణమైన రూపాలు.(మెరియమ్ వెబ్‌స్టర్)
Image: Unsplash
గ్యాలెంటైన్స్ డే (Galentine's Day)
మహిళల మధ్య ఉన్న స్నేహబంధానికి ప్రాముఖ్యత కల్పిస్తూ ఏటా ఫిబ్రవరి 13న ఈ గ్యాలెంటైన్స్ డేని జరుపుకొంటారు. (మెరియమ్ వెబ్‌స్టర్)
Image: Unsplash