శారీ.. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ 

నిహారిక కొణిదెల మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు..

నాగ శౌర్య హీరోగా ‘ఒక మనసు’తో వెండి తెరకు పరిచయమైంది.

హీరోయిన్‌ కంటే ముందు టీవీ ప్రోగ్రామ్స్‌కి యాంకర్‌గా చేసింది. ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లోనూ నటించింది.

‘నాన్న కూచి’, ‘మ్యాడ్‌ హౌస్‌’, ‘డెడ్‌ పిక్సెల్‌’ వంటి వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల్ని మెప్పించింది.

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత నిహారిక తెలుగులో ‘వాట్‌ ద ఫిష్‌’, కోలీవుడ్‌లో ‘మద్రాస్‌కారణ్‌’లో నటిస్తోంది. ఈ రెండు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

ఇటీవల ‘మద్రాస్‌కారణ్‌’ నుంచి ఓ పాట వచ్చింది. అందులో నిహారిక, షేన్‌ గుప్తా మధ్య కెమిస్ట్రీ వైరల్‌గా మారింది

నిహారిక నిర్మాతగా వెబ్‌ సిరీస్‌లు చేసింది. ఈ ఏడాది ‘కమిటీ కుర్రాళ్లు’తో సినిమా నిర్మాతగానూ విజయాన్ని అందుకుంది.

నా బ్యాగ్రౌండ్‌ వల్ల కథ బాగున్న చిన్న సినిమాలు నా దగ్గరకు రావడం లేదు. అలా మిస్‌ అయిన వాటిలో ‘కలర్ ఫొటో’ ఒకటి అని చెప్పింది. 

‘మోడ్రన్‌ డ్రెస్సులెన్ని ఉన్నా చీరలో ఉండే అందమే వేరు, అందుకే ఆల్‌టైమ్‌ ఫేవరెట్ శారీ’ అంటోంది.

‘షూటింగ్‌ నుంచి విరామం దొరికితే ఫ్యామిలీతో కలసి ట్రిప్‌కి వెళ్తుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంది.

2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన 10- చిత్రాలు

2024.. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నాయికలు!

ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు

Eenadu.net Home