అండర్-19 ప్రపంచ కప్.. టైటిల్ అందించిన భారత కెప్టెన్లు
పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి భారత్ ఏడు అండర్-19 వరల్డ్ కప్‌లు సాధించింది. ఆ టైటిళ్లు అందించిన కెప్టెన్‌లు వీరే!
నిక్కీ ప్రసాద్
2025 వరల్డ్ కప్‌లో నిక్కి ప్రసాద్ కెప్టెన్సీలో భారత్ అదరగొట్టింది. టీమ్‌ఇండియా ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ గెలిచి వరుసగా రెండోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
షెఫాలీ వర్మ
మహిళల విభాగంలో 2023లో మొట్టమొదటి అండర్-19 వరల్డ్ కప్ నిర్వహించారు. షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది.
యశ్ ధుల్
వెస్టిండీస్‌లో జరిగిన 2022 అండర్-19 ప్రపంచ కప్‌లో యశ్ ధుల్ భారత్‌ను నడిపించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పృథ్వీ షా
2018 ఎడిషన్‌లో పృథ్వీ షా సారథ్యంలో భారత్ టైటిల్ సాధించింది. ఆసీస్‌తో జరిగిన ఫైనల్‌లో 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో టీమ్ఇండియా 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. మన్‌జోత్ కల్రా (101*) సెంచరీ చేశాడు.
ఉన్ముక్త్ చంద్
2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా అవతరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఉన్ముక్త్ (111*) శతకం బాదాడు.
విరాట్ కోహ్లీ
2008లో కోహ్లీ సారథ్యంలో భారత్ రెండో వరల్డ్ కప్ సాధించింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాపై 12 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) గెలిచింది.
మహ్మద్ కైఫ్
భారత్‌కు తొలి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ అందించింది మహ్మద్ కైఫ్. 2000 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.