తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ సందడి చేశారు. 

బంతి, చామంతి, తంగేడుతో పాటు వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దిన బతుకమ్మ.. ఆపై అందంగా అలంకరించిన గౌరమ్మ 


విద్యుత్‌ వెలుగుల్లో అమ్మవారి మోముతో ఆకట్టుకుంటున్న బతుకమ్మ

అమ్మవారి రూపంలో విభిన్నంగా తీర్చిదిద్దిన బతుకమ్మ.. బతుకమ్మల వద్ద సందడి చేస్తున్న మహిళలు, చిన్నారులు

 ఇజ్రాయిల్‌, పాలస్తీనా యుద్ధం, మరికొన్ని దేశాల మధ్య గొడవలను చూసి.. ‘బతుకమ్మ బతుకమ్మ ఓ అమ్మా.. నీ చల్లని దీవెనలు ఈయవమ్మా! ప్రపంచ శాంతి కోసం ఆశీర్వదించమ్మా’.. అంటూ సందేశమిస్తూ రూపొందించారు.


రాజేంద్రనగర్‌లోని పద్మశ్రీ హిల్స్‌ కాలనీలో దుర్గమ్మతో తీర్చి దిద్దిన బతుకమ్మ

సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలతో యువతులు

సద్దుల బతుకమ్మ సంబరాల్లో  వివిధ రకాల పుష్పాలు, విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దిన బతుకమ్మలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో శివలింగం రూపంలో తయారు చేసిన బతుకమ్మ 

అమ్మవారు మయూరంపై విహరిస్తున్నట్లు తీర్చిదిద్దిన బతుకమ్మ

స్థానిక చెరువులు, కొలనుల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న మహిళలు

సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌, జీహెచ్‌ఎంసీ పార్కు వద్ద బతుకమ్మ ఆడుతున్న మహిళలు

తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సంబరాల్లో చిరునవ్వులు చిందిస్తూ సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను ఎత్తుకున్న యువతి

ఒలింపిక్స్‌ గురించి ఆసక్తికర విషయాలు

అగ్ర హీరోలతో దుషారా

ధనుష్‌.. ఓ ఇన్‌స్పిరేషన్‌

Eenadu.net Home