అలా మొదలైంది ‘నిత్య’ ప్రయాణం  


‘అలా మొదలైంది’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిత్యమేనన్‌.

#Instagram/Nithya Menen

తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

#Instagram/Nithya Menen 

ఈ భామ మలయాళ స్టార్‌ హీరోతో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారని సోషల్‌ మీడియా, పలు వెబ్‌ సైట్లలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

#Instagram/Nithya Menen 

ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. ఏ విషయమైనా నిజమని తెలిశాకే, దాన్ని పబ్లిష్‌ చేయాలని మీడియాను కోరింది.

#Instagram/Nithya Menen 

 కేరళలో పుట్టి బెంగళూరులో పెరిగిన నిత్య.. ఎనిమిదేళ్ల వయసులోనే వెండితెరపై మెరిసింది.

#Instagram/Nithya Menen 

‘ది మంకీ హూ న్యూ టూ మచ్‌’ అనే ఇంగ్లిష్‌ చిత్రంలో బాల నటిగా మెరిసింది. ఇందులో టబుకి సోదరిగా కనిపిస్తుంది నిత్య.

#Instagram/Nithya Menen 

2006లో ‘సెవెన్‌ ఓ క్లాక్’ అనే కన్నడ చిత్రంతో నాయికగా మారింది. 2009లో ‘ఆకాశ గోపురం’తో మాలీవుడ్‌కి పరిచయమైంది.

#Instagram/Nithya Menen  

‘నూట్రెన్‌బధు 180’తో తమిళ, 2019లో ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.

#Instagram/Nithya Menen 

‘ఇష్క్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’, ‘ఒక అమ్మాయి తప్ప’, ‘జనతా గ్యారేజ్‌’, ‘అ!’, ‘స్కైలాబ్‌’ తదితర విభిన్న కథా సినిమాలతో ఆకట్టుకుంది.

#Instagram/Nithya Menen 

ఈ ఏడాది పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘భీమ్లా నాయక్‌’లో సందడి చేసింది. ఆమె నటించిన 19(1)(a) అనే మలయాళ చిత్రం త్వరలోనే ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది.

#Instagram/Nithya Menen 

నిత్య ప్రస్తుతం.. ‘తిరుచిత్రంబళం’ (తమిళం), ‘ఆరామ్‌ తురికల్పన’ (మలయాళం) చిత్రాలతో బిజీగా ఉంది.

#Instagram/Nithya Menen 

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home