నితీశ్‌.. ‘తగ్గేదేలే’.. రికార్డులే రికార్డులు

మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత ఆల్‌రౌండర్ నితీశ్‌ రెడ్డి (105*; 176 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) శతకంతో అదరగొట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి శతకం చేసిన అతను పలు రికార్డులు నెలకొల్పాడు. అవేంటంటే..

ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నితీశ్ నిలిచాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే (87) పేరిట ఈ రికార్డు ఉండేది.

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ బాది తొలి బ్యాటర్‌ నితీశే. 

టెస్టుల్లో 8వ స్థానంలో వచ్చి శతకం చేసిన మూడో అతిపిన్న వయస్కుడిగా (21 ఏళ్ల 216 రోజులు) నితీశ్‌ ఘనత సాధించాడు. అబుల్ హసన్ (20 ఏళ్ల 108 రోజులు), అజయ్‌ రాత్రా (20 ఏళ్ల 150 రోజులు) ముందున్నారు. 

ఆస్ట్రేలియాలో పిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా నితీశ్ రికార్డు సాధించాడు. సచిన్(18 ఏళ్ల 256 రోజులు), రిషభ్‌ పంత్ (21 ఏళ్ల 92 రోజులు) ముందున్నారు. 

నితీశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక సిక్సర్ బాది ఈ పర్యటనలో 8 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో ఎక్కువ సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

సిడ్నీలో ఇప్పటివరకు ఏం జరిగింది? ఎవరు బాగా ఆడారు?

టీమ్‌ ఇండియా సిరీస్‌లు @ 2025

భారత బౌలర్లు @ 2024

Eenadu.net Home