అందాల ‘శాకిని’.. నివేదా థామస్‌

నటనా ప్రాధాన్య పాత్రలతో మెప్పిస్తూ.. కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి.. నివేదా థామస్‌.

Image:Instagram/Nivetha Thomas

తాజాగా ఆమె ‘శాకిని ఢాకిని’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో నివేదాతోపాటు రెజీనా కూడా నటించింది.

Image:Instagram/Nivetha Thomas

కొరియన్‌ సినిమా ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 16న విడుదల కానుంది.

Image:Instagram/Nivetha Thomas

యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం.. పలు పోరాట సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించిందట నివేదా.

Image:Instagram/Nivetha Thomas

నవంబర్‌ 2, 1995న చెన్నైలో జన్మించిన నివేదా థామస్‌.. ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ పట్టా పొందింది.

Image:Instagram/Nivetha Thomas 

నివేదా చిన్నప్పుడే బుల్లితెరపై సందడి చేసింది. సన్‌ టీవీతోపాటు ఇతర ఛానళ్లలో ప్రసారమైన పలు ధారావాహికల్లో బాలనటిగా కనిపించింది.

Image:Instagram/Nivetha Thomas 

2008లో వచ్చిన ‘వేరుతే ఓరు భార్య’ అనే మలయాళ చిత్రంతో తొలిసారి వెండితెరపై మెరిసింది. ఈ చిత్రంలో నటనకుగానూ కేరళ ‘ఉత్తమ బాల నటి’ అవార్డును అందుకుంది.

Image:Instagram/Nivetha Thomas 

నాని హీరోగా 2016లో వచ్చిన ‘జెంటిల్‌ మన్‌’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా.. ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’లతో అలరించింది.

Image:Instagram/Nivetha Thomas 

హీరోయిన్‌గానే కాదు.. రజనీకాంత్‌ ‘దర్బార్‌’లో ఆయనకు కుమార్తెగా, పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది.

Image:Instagram/Nivetha Thomas 

ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నివేదాకు చాలా భాషలు తెలుసు. మలయాళం, తమిళ్‌, ఫ్రెంచ్‌, హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో చక్కగా మాట్లాడగలదు.

Image:Instagram/Nivetha Thomas 

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home