30 రోజులు చక్కెర మానేస్తే ఎన్ని లాభాలో...

‘నో షుగర్‌ ఛాలెంజ్‌’కు మీరు సిద్ధమేనా? ఇలా చేస్తే.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం. 

షుగర్‌ మానేస్తే బరువు తగ్గుతారు

చక్కెర పదార్థాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి తగిన మోతాదులో పోషకాలు లోపిస్తాయి. మనం తినే ఆహారంలో చక్కెర పదార్థాలకు కోత పెట్టడం ద్వారా శరీర బరువు తగ్గడంలో ఉపకరిస్తుంది.  

రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో..

మనం తీసుకొనే ఆహారంలో చక్కెర లేకుండా జాగ్రత్త పడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా, నియంత్రణలో ఉంటాయి. మధుమేహం ముప్పు తగ్గుతుంది. 

కాలేయం పనితీరు భేష్‌!

జీర్ణక్రియకు తోడ్పడే పైత్యరసాన్ని ఉత్పత్తి చేయటం కాలేయం పని. చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల ఈ కీలక అవయవం పనితీరు దెబ్బతింటుంది. షుగర్‌ లేని ఆహారం తీసుకోవడం ద్వారా దీని పనితీరు మెరుగుపడుతుంది.

అందం.. ఆరోగ్యం..

చక్కెరతో కూడిన పానీయాలు, చాక్లెట్లు వంటివి తింటే దంతాలకు హానికరం. పైగా చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి. నో షుగర్‌ ఛాలెంజ్‌ ద్వారా దంతాలు, చిగుళ్ల సమస్యలనుంచి బయటపడొచ్చు. నోటి సంబంధిత సమస్యల్ని నియంత్రించొచ్చు. 

గుండె జబ్బులు దూరం..

చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న ఆహారం గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. వాపును తగ్గించడంతో పాటు కొలెస్ట్రాల్‌ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది.

చర్మ సౌందర్యం

చక్కెర పదార్థాలు తినడం వల్ల చర్మసంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చక్కెర లేని ఆహారం వీటికి చెక్‌ పెడుతుంది. చక్కెరను వాడకపోవడం వల్ల సున్నితమైన నిగారింపుతో, మరింత ప్రకాశవంతమైన చర్మాన్ని పొందొచ్చు. 

ఎనర్జీ లెవెల్‌ పెంచుతుంది

శక్తి కోసం చక్కెరలపై ఆధారపడటం వల్ల శరీరానికి నష్టం జరుగుతుంది. అందుకే, షుగర్‌ లేని ఆహారం తీసుకోవడం వల్ల స్థిరమైన శక్తి అందడంతో పాటు, రోజంతా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. 

మానసిక సమస్యలు దూరం..

చక్కెర ఉన్న ఫుడ్‌ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు, ఆందోళన పెరుగుతుంది. అందువల్ల చక్కెర లేని ఆహారం తీసుకుంటే.. మానసిక స్పష్టత, మెరుగైన జ్ఞాపకశక్తి ఏర్పడుతుంది. సానుకూల ఫలితాలు వస్తాయి.

పుచ్చకాయతో లాభాలెన్నో...

మే 17న హైపర్‌ టెన్షన్‌ డే

ముంజెలు తింటున్నారా... అయితే ఇవి తెలుసుకోండి!

Eenadu.net Home