నథింగ్‌ కొత్త ఫోన్‌ విశేషాలివీ..

నథింగ్‌ కంపెనీ నథింగ్‌ ఫోన్‌ 2ఏ పేరిట కొత్త ఫోన్‌ను మార్చి 5న లాంచ్‌ చేసింది. నథింగ్‌ ఫోన్‌ 1, 2 తర్వాత ఆ కంపెనీ నుంచి వచ్చిన మూడో ఫోన్‌ ఇది.

నథింగ్‌ ఫోన్‌ 2ఏ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999. 8జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.25,999. 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.27,999.

మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. బ్లాక్‌, వైట్‌ కలర్స్‌లో లభిస్తుంది.

This browser does not support the video element.

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 2.5తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి.

ఇందులో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 30Hz నుంచి 120Hz రిఫ్రెష్‌ రేటుతో ఈ డిస్‌ప్లే పనిచేస్తుంది.

 మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌ను అమర్చారు.

వెనుకవైపు 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు కెమెరాలు అమర్చారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

5జీ నెట్‌వర్క్‌, వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFCకి సపోర్ట్‌ చేస్తుంది. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఉంది.

#Image source: @Mukul Sharma

This browser does not support the video element.

ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. 45W ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

Eenadu.net Home