వినూత్న లుక్‌తో CMF ఫోన్ 1
నథింగ్ సబ్‌బ్రాండ్ సీఎంఎఫ్ ఫోన్ 1 పేరుతో తొలి స్మార్ట్‌ఫోన్‌ను జులై 8న భారత్‌లో విడుదల చేసింది.
6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌టీపీఎస్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేటు, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.
50MP ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 16MP కెమెరా ఇచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7,300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ 2.6 ఓఎస్‌తో వస్తోంది. 2 ఓఎస్, మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. వైఫై 6, బ్లూటూత్ 5.3, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
6GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.17,999.
జులై 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్‌లో కింద 1000 తగ్గింపు లభిస్తోంది.
నలుపు, ఆరెంజ్, లైట్ గ్రీన్, బ్లూ రంగుల్లో ఇది లభిస్తోంది. ఫోన్ ఛార్జర్‌ను రూ.799తో విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
లాన్యార్డ్, స్టాండ్, కార్డ్‌హోల్డర్ వంటి ప్రత్యేక యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఒక్కో దాని ధర రూ.799.
బ్యాక్ కవర్లు రూ.1,499తో కొనుగోలు చేయొచ్చు. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై ఉండే స్క్రూలను తీసేసి కావాలనుకున్నప్పుడల్లా కొత్త లుక్ తీసుకురావొచ్చు.