పెట్టుబడి పెడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!
మీ పెట్టుబడి మొత్తాన్ని షేర్ మార్కెట్లో అయినా.. ఇతర రంగాల్లో అయినా ఒకే చోట పెట్టకూడదు. వివిధ పథకాలు, ఫండ్లను ఎంచుకోవాలి.
Source: Pixabay
మీరు ఎంచుకునే పెట్టుబడి పథకాలు మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చే విధంగా.. అన్ని రకాల నష్టభయాలను తట్టుకునే విధంగా ఉండాలి.
Source: Pixabay
స్నేహితులు, బంధువుల సలహాలు తీసుకోవద్దు. స్వయంగా పరిశీలన చేసి పెట్టుబడి పెట్టాలి. లేదా మార్కెట్ నిపుణుల సూచనలు పాటించొచ్చు.
Source: Pixabay
ఈక్విటీల్లో మదుపు చేయాలనుకుంటే కనీసం ఏడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. అప్పుడే స్వల్పకాలిక హెచ్చుతగ్గులు మిమ్మల్ని భయపెట్టవు.
Source: Pixabay
అనుకోని ఖర్చుల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను రద్దు చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. చివరి వరకు కొనసాగిస్తేనే మంచి రాబడి వస్తుంది.
Source: Pixabay
స్వల్ప, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం విభిన్న మార్గాలుంటాయి. మీ అవసరాల్ని బట్టి వాటిని ఎంచుకోవచ్చు.
Source: Pixabay
మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మీరు ఆశించినంత మేర రాణిస్తున్నాయా లేదా పరిశీలించాలి.
Source: Pixabay
పెట్టుబడి పెట్టడమే కాదు.. ఎప్పుడు ఉపసంహరించుకోవాలో కూడా తెలియాలి. పెట్టుబడికి తగ్గ రాబడి రానప్పుడు ఉపసంహరించుకోవడం మేలు.
Source: Pixabay