వన్డే ప్రపంచకప్‌... భారత్‌ రికార్డులు ఇవే!

రెండు

భారత్‌ వన్డే ప్రపంచకప్‌ను ఇప్పటివరకు రెండుసార్లు (1983, 2011) గెలుచుకుంది. తొలిసారి కపిల్‌ నాయకుడు కాగా, రెండోసారి ధోనీ.

45

భారత్‌ తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడింది సచిన్‌ తెందూల్కర్‌ (45).

2278

వన్డే ప్రపంచకప్‌లో సచిన్‌ సాధించిన పరుగులు 2278. ప్రపంచవ్యాప్త బ్యాటర్లలోనూ ఇదే అత్యధికం.

 23

మన దేశం నుంచి ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డు హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మదే. మొత్తంగా 23సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు.

ఆరు

క్రికెట్‌లో అత్యధిక ప్రపంచకప్‌లు ఆడినవాళ్లు ఇద్దరే. ఒకరు సచిన్‌ కాగా, రెండో క్రికెటర్‌ జావెద్‌ మియాందాద్‌. ఇద్దరూ చెరో ఆరు టోర్నీలు ఆడారు. 

23

భారత్‌ తరఫున వరల్డ్‌ కప్‌లో కెప్టెన్‌గా అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడింది మహ్మద్‌ అజహరుద్దీన్‌. మొత్తంగా 23 మ్యాచ్‌లు ఆడగా పదింట గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడాడు. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు.

14

మెగా టోర్నీలో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు అనిల్‌ కుంబ్లే పేరున ఉంది. మొత్తంగా 14 క్యాచ్‌లు పట్టాడీ లెజెండరీ లెగ్‌ స్పిన్నర్‌. 

42

భారత్‌ తరఫున వరల్డ్‌ కప్‌లో అత్యధిక ఔట్ల ఘనత మహేంద్ర సింగ్‌ ధోనీది. 29 మ్యాచ్‌ల్లో 42 మంది బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించాడు.

44

టీమ్‌ ఇండియా బౌలర్లలో ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసింది జహీర్‌ ఖాన్‌. మొత్తంగా 44 మందిని జహీర్‌ ఔట్‌ చేశాడు. 

కోల్‌కతా - హైదరాబాద్‌.. క్వాలిఫయర్‌ - 1 రికార్డులివే

ఐపీఎల్.. ఏ సీజన్‌లో ఏ ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు

ఐపీఎల్‌.. ఏ సీజన్‌లో ఏ జట్టుకు చివరి స్థానం

Eenadu.net Home