ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోర్లు ఇవే.. 

సౌతాఫ్రికా 428/5.. (శ్రీలంకపై 2023 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డికాక్, డస్సెన్, మార్‌క్రమ్‌ శతకాలు సాధించారు.

ఆస్ట్రేలియా 417/6.. (అఫ్గానిస్థాన్‌పై 2015 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్లు వార్నర్ (178), స్టీవ్ స్మిత్ (95), మ్యాక్స్‌వెల్ (88) పరుగులు చేశారు.

భారత్ 413/5 (బెర్ముడాపై 2007 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్ (114), గంగూలీ (89), యువరాజ్‌ సింగ్ (83) పరుగులు చేశారు. 

సౌతాఫ్రికా 411/4 (ఐర్లాండ్‌పై 2015 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఆషీమ్ ఆమ్లా (159), డుప్లెసిస్ (109) పరుగులు చేశారు. 

సౌతాఫ్రికా 408/5 (వెస్టిండీస్‌పై 2015 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌ (162) భారీ శతకం బాదాడు. 

శ్రీలంక 398/5 (కెన్యాపై 1996 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌ లంక ఆటగాళ్లు అరవింద డిసిల్వా (145), అసంక గురుసిన్హా (84) పరుగులు చేశారు. 

ఇంగ్లాండ్ 397/6 (అఫ్గానిస్థాన్‌పై 2019 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పేయర్లు ఇయాన్ మోర్గాన్ (148), బెయిర్‌ స్టో (90), జో రూట్ (88) పరుగులు సాధించారు.

న్యూజిలాండ్ 393/6 (వెస్టిండీస్‌పై 2015 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (237) డబుల్ సెంచరీ బాదాడు.

ఇంగ్లాండ్ 386/6 (బంగ్లాదేశ్‌పై 2019 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్‌ ఆటగాడు జేసన్ రాయ్ (153) స్కోరు చేశాడు.

ఆస్ట్రేలియా 381/5 (బంగ్లాదేశ్‌పై 2019 ప్రపంచకప్‌లో)

ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (166) భారీ శతకం సాధించాడు.

ఎకానమీలో ఫెర్గూసన్‌ ది బెస్ట్‌.. ఆ తర్వాత వీరే!

క్రిస్‌ గేల్‌ రికార్డు బ్రేక్‌..

సూపర్‌ 8కి ఏ టీమ్‌ ఎలా వచ్చిందంటే?

Eenadu.net Home