320km రేంజ్‌తో ఓలా కొత్త స్కూటర్
మూడోతరం జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన 8 విద్యుత్ స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్ శుక్రవారం (జనవరి 31) లాంచ్ చేసింది.
ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్+, ఎస్1 ప్రో, ఎస్1 ప్రో+ పేరిట మొత్తం నాలుగు రకాల స్కూటర్లను వివిధ బ్యాటరీ ఆప్షన్లలో తీసుకొచ్చింది.
ఎస్1 ప్రో+ 5.3kWh బ్యాటరీ వేరియంట్ ధర ₹1,69,999. టాప్ స్పీడ్ 141kmph. ఐడీసీ రేంజ్ 320km
4kWh బ్యాటరీ కలిగిన ఎస్1 ప్రో+ స్కూటర్ ధర ₹1,54,999. టాప్‌స్పీడ్ 128kmph. 242 km ఐడీసీ రేంజ్. ఈ రెండు స్కూటర్లలో 13kW మోటార్ ఇచ్చారు.
ఎస్1 ప్రో 4kWh బ్యాటరీ వేరియంట్ ధర ₹1,34,999. టాప్ స్పీడ్ 125kmph. 242km ఐడీసీ రేంజ్.
3kWh బ్యాటరీ వేరియంట్ ఎస్1ప్రో ధర ₹1,14,999. టాప్‌స్పీడ్ 117 kmph. 176 km ఐడీసీ రేంజ్. ఎస్1 ప్రో స్కూటర్లు 11kW మోటార్‌తో వస్తున్నాయి.
ఎంట్రీ లెవల్‌లో తెచ్చిన ఎస్1ఎక్స్ 2kWh బ్యాటరీ వేరియంట్ ధర ₹79,999. టాప్‌స్పీడ్ 101 kmph. ఐడీసీ రేంజ్ 108km.
3kWh వేరియంట్ ఎస్1ఎక్స్ ధర ₹89,999. టాప్ స్పీడ్ 115kmph. ఐడీసీ రేంజ్ 176 km.
4kWh బ్యాటరీ ఆప్షన్‌తో లాంచ్ చేసిన ఎస్1ఎక్స్ ధర ₹99,999. టాప్‌స్పీడ్ 101 kmph. ఐడీసీ రేంజ్ 108km.
ఎస్1ఎక్స్ శ్రేణిలో ఎస్1ఎక్స్+ ఫ్లాగ్‌షిప్ స్కూటర్. 4kWh బ్యాటరీ వేరియంట్ ధర ₹1,07,999. టాప్ స్పీడ్ 125 kmph. రేంజ్ 242 km.