ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ.. ఈ వివరాలు తెలుసా?
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది వస్తోన్న అతిపెద్ద పబ్లిక్ ఇష్యూల్లో ఇదొకటి. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓకి సంబంధించిన కీలక వివరాలు తెలుసుకుందాం.
ఐపీఓ తేదీలు: ఆగస్టు 2-6
ఐపీఓ సమీకరణ లక్ష్యం:
రూ .6,145 కోట్లు
(రూ.5,500 కోట్ల కొత్త షేర్లు, రూ.645 కోట్లు ఓఎఫ్‌ఎస్ ద్వారా..)
ఐపీఓ ధరల శ్రేణి: రూ.72-76
షేర్ల అలాట్‌మెంట్ తేదీ: ఆగస్టు 7
లిస్టింగ్ తేదీ: ఆగస్టు 9
మదుపర్లు ఆర్డర్ చేయాల్సిన కనీస షేర్లు: రూ.14,820తో 195 షేర్లు
ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.7 రాయితీ
క్యూఐబీలకు 75%, ఎన్‌ఐఐలకు 15%, రిటైల్ మదుపర్లకు 10% షేర్లు రిజర్వు
ఐపీఓ లక్ష్యం: పరిశోధన, అభివృద్ధి, రుణ చెల్లింపులు, తయారీ సామర్థ్యం విస్తరణ, కార్పొరేట్ అవసరాలు
images Credit: OLA Bike