రోడ్‌స్టర్‌.. ఓలా తొలి మోటార్‌ సైకిల్‌

ఇప్పటివరకు విద్యుత్‌ స్కూటర్లకు మాత్రమే పరిమితమైన ఓలా ఎలక్ట్రిక్‌ తాజాగా రోడ్‌స్టర్‌ పేరిట తొలి మోటార్‌ సైకిల్‌ను ఆగస్టు 15న లాంచ్‌ చేసింది.

రోడ్‌ స్టర్‌, రోడ్‌స్టర్‌ ఎక్స్‌, రోడ్‌ స్టర్‌ ప్రో.. మొత్తం మూడు వేరియంట్లలో ఈ మోటార్‌ సైకిల్‌ తీసుకొచ్చింది. వీటిలో సబ్‌ వేరియంట్లు ఉన్నాయి.

రోడ్‌ స్టర్ ఎక్స్‌

2.5kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.74,999, 3.5kWh వేరియంట్‌ ధర రూ.85,999, 4.5kWh వేరియంట్‌ ధర రూ.99,999.

సింగిల్‌ ఛార్జ్‌తో గరిష్ఠంగా 200 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుంది. దీని టాప్‌ స్పీడ్‌ 124 కిలోమీటర్లు. 4.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో వస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.

రోడ్‌స్టర్‌

దీని టాప్‌ స్పీడ్‌ 126 కిలోమీటర్లు. 3.5kWh బ్యాటరీ ప్యాక్‌తో 151km, 4.5 kWhతో 190 కిలోమీటర్లు, 6kWh బ్యాటరీతో 248 కిలోమీటర్లు రేంజ్‌ ఇస్తుంది. 6.8 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.

3.5kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.1.04 లక్షలు కాగా, 4.5kWh బ్యాటరీ ప్యాక్‌ ధర రూ.1,19,999, 6kWh బ్యాటరీ ప్యాక్‌ ధర రూ.1,39,999. జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

రోడ్‌స్టర్‌ ప్రో

ఈ బైక్‌ టాప్‌ స్పీడ్‌ 194 కిలోమీటర్లు. సింగిల్ ఛార్జ్‌తో 579 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో 10 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్‌ డిస్‌ప్లే ఇచ్చారు.

9 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న బైక్‌ ధర రూ.1.99 లక్షలు కాగా.. 16kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ధర రూ.2.49 లక్షలు. వచ్చే ఏడాది దీపావళి నుంచి వీటి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home