100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4

నార్డ్‌ సీఈ 4 ఫోన్‌ ఏప్రిల్‌ 1న భారత్‌లో లాంచ్‌ అయ్యింది.

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఓఎస్‌తో ఫోన్‌ వస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ అమర్చారు.

6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది.

5,500 mAh బ్యాటరీ 100W సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లోపు ఫుల్‌ బ్యాటరీ ఛార్జ్‌ చేయొచ్చు.

50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్‌, 8 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 355 అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఇందులో ఉన్నాయి.

8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.24,999, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.26,999గా పేర్కొంది.

డార్క్‌ క్రోమ్‌, సెలాడన్‌ మార్బుల్‌ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్‌ 4 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా నార్డ్‌ సీఈ4 కొనుగోలుపై వన్‌ప్లస్‌ నార్డ్‌ 2ఆర్‌ ఇయర్‌ బడ్స్‌ను ఉచితంగా అందించనున్నట్లు వన్‌ప్లస్‌ పేర్కొంది. 

అక్టోబర్‌లో రానున్న ఫోన్లు ఇవే..!

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థలివీ!

Eenadu.net Home