వన్‌ ప్లస్ నుంచి మరో 5జీ ఫోన్‌.. ధర ఎంతంటే? 

చైనీస్‌ టెక్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ మరో 5జీ మోడల్‌ని లాంచ్‌ చేసింది. వన్‌ ప్లస్‌ 10టీ5G పేరుతో దీన్ని విడుదల చేసింది.

image:oneplus

6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్‌.

image:oneplus

క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్‌ జెన్1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

image:oneplus

4,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యమున్న ఈ మొబైల్‌.. 150 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 19 నిమిషాల్లో వంద శాతం ఛార్జింగ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది.

image:oneplus

వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 + 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. image:oneplus

8జీబీ/128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 49,999. 12 జీబీ/256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 54,999. 16 జీబీ/256 జీబీ స్టోరేజ్‌ ధర రూ.55,999. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభించనుంది.

image:oneplus  

ఐసీఐసీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 వరకూ డిస్కాంట్ లభిస్తుంది. నో కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది. image:oneplus

ఈ ఫోన్‌ కోసం ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఓపెన్ సేల్స్ ఆగస్టు 6న ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌, వన్‌ప్లస్‌ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

image:oneplus

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home