బడ్జెట్‌ ధరలో ఒప్పో 5జీ మొబైల్‌

తాజాగా భారత మొబైల్‌ మార్కెట్లో ఒప్పో ఏ78 పేరుతో 5జీ మోడల్‌ విడుదలైంది. విక్రయాలు మొదలయ్యాయి. మరి ఈ మొబైల్‌ స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా..

Image: Oppo

ఒప్పో ఏ78లో 6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. రిఫ్రెష్‌ రేట్‌ 90 హెర్జ్‌.

Image: Oppo

మీడియాటెక్‌ డైమెన్సిటీ 700(5జీ) ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. 

Image: Oppo

దీంట్లో 8 జీబీ ర్యామ్‌ ఉంది. మరో 8 జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. ఎస్డీ కార్డుతో 1 టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. 

Image: Oppo

వెనకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Image: Oppo

బ్యాటరీ విషయానికొస్తే 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 60 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుందని ఒప్పో సంస్థ చెబుతోంది. 

Image: Oppo

ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌13 ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌.. గ్లోయింగ్‌ బ్లాక్‌, గ్లోయింగ్‌ బ్లూ రంగుల్లో లభిస్తోంది. 

Image: Oppo

ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌లో ఈ మొబైల్స్‌ను విక్రయిస్తున్నారు. ధర రూ. 18,999. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై 10శాతం డిస్కౌంట్‌ ఉంది.

Image: Oppo

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home