ఒప్పో ఎఫ్‌25 ప్రో.. ఫీచర్లు ఇవే..

ఒప్పో ఎఫ్‌ 25 ప్రో 5జీ ఫిబ్రవరి 29న భారత్‌లో లాంచ్‌ అయ్యింది.

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 14.0తో ఫోన్‌ వస్తోంది.

6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది.

మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ అమర్చారు.

5,000 mAh బ్యాటరీ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 48 నిమిషాల్లో మొత్తం ఛార్జ్‌ పూర్తవుతుంది.

64 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సోనీ IMX355 వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

8 జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.28,999.

ఒప్పో ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చు.

లావా రెడ్‌, ఓషన్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ అమ్మకాలు మార్చి 5 నుంచి ప్రారంభం అవుతాయి.

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు విశేషాలు..

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

ఏఐ రాణించలేని ఉద్యోగాలేంటో తెలుసా?

Eenadu.net Home