ఆశాభట్.. కుర్రకారు ఫ్లాట్
‘జంగ్లీ’తో తెరంగేట్రం చేసిన ఆశా భట్ ఇప్పుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
Image:Instagram
విష్వక్‌సేన్ కథానాయకుడిగా రూపొందిన ‘ఓరి దేవుడా..!’లో ఆశా భట్, మిథిలా పాల్కర్ హీరోయిన్లుగా నటించారు.
Image:Instagram
తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Image:Instagram
ఆశా భట్.. సెప్టెంబరు 5, 1992న కర్ణాటకలోని భద్రావతిలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులిద్దరూ మెడికల్ ల్యాబోరెటరీ టెక్నీషియన్స్.
Image:Instagram
భద్రావతిలో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న ఈ భామ..ఇంటర్ చదువుతున్నప్పుడు ఎన్‌సీసీ (నేషనల్ క్యాడెట్ కార్ప్స్)లో చేరింది.
Image:Instagram
అనంతరం బెంగళూరులోని ఆర్.వి. ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
Image:Instagram
‘ది టైమ్స్ గ్రూప్స్’ నిర్వహించిన మిస్ దివా 2014 అందాల పోటీల్లో పాల్గొని ‘మిస్ ఇండియా సూప్రనేషనల్’ కిరీటాన్ని దక్కించుకుంది.
Image:Instagram
‘క్లోజ్ అప్’, ‘యమహా మోటార్ కంపెనీ’, ‘ఫరెవర్ మార్క్’ వంటి అనేక బ్రాండ్‌ల టీవీ వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది.
Image:Instagram
జంగ్లీలో మిరా అనే జర్నలిస్ట్ పాత్రలో నటించిన ఆశా.. ‘రాబర్ట్’తో కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
Image:Instagram
ఆశా భట్ శాకాహారి. ఇడ్లీ, దోశ, బర్గర్స్ అంటే ఇష్టమట. వంట చేయడం, ట్రావెలింగ్, బుక్ రీడింగ్ హాబీస్.
Image:Instagram
ఈమె నటే కాదు.. సామాజిక కార్యకర్త కూడా. అస్త్ర ఫౌండేషన్ పేరుతో NGOని నడుపుతోంది. శునకాలంటే కూడా చాలా ఇష్టం.
Image:Instagram