23 ఏళ్ల తర్వాత ఆ గౌరవం దక్కుతుందా?

అకాడెమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం (విదేశీ) కేటగిరీలో నామినేషన్‌కు ఏటా మన దేశం నుంచి ఓ సినిమాను ప్రతిపాదిస్తుంటారు. ఫైనల్‌ లిస్ట్‌లో మన ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఇప్పుడు ‘లాపతా లేడీస్‌’ను ప్రతిపాదించిన నేపథ్యంలో.. ఇప్పటివరకు నామినేట్‌ అయిన సినిమాలేంటో చూద్దామా!

మదర్‌ ఇండియా (1957)

నర్గీస్‌, సునీల్‌ దత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మెహబూబ్‌ ఖాన్‌ దర్శకుడు. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిందీ బాలీవుడ్‌ సినిమా. 

సలామ్‌ బాంబే (1988 )

మీరా నాయర్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. షఫీఖ్‌ సయ్యద్‌, హన్సా విఠల్‌, ప్రధాన పాత్రధారులు. ముంబయి మురికివాడల నేపథ్యంలో సాగే సినిమా ఇది. 

లగాన్‌ (2001)

ఆమిర్‌ ఖాన్‌, గ్రేసీ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. అశుతోశ్‌ గొవారికర్‌ దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్యం రాకముందు భారత్‌ - క్రికెట్‌ - ఇంగ్లండ్‌ అంశాలపై తెరకెక్కిన చిత్రమిది.

లాపతా లేడీస్‌ (2024 )

కిరణ్‌ రావ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. నితాన్సీ గోయల్‌, ప్రతిభా రత్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో తారుమారైన సంఘటన ఇతివృత్తంగా తెరకెక్కించారు. మరి ఈ సినిమా బరిలో నిలుస్తుందా అనేది చూడాలి.

పుష్పరాజ్‌ అన్నకూతురు.. పావని

ఈ ఏడాది అత్యధికంగా వెతికిన సినిమాలివే!

ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే

Eenadu.net Home