క్రెడిట్‌ కార్డుతో.. ఇలా చేస్తే కష్టమే!

క్రెడిట్‌ కార్డులు సులభంగానే మంజూరవుతాయి. కానీ, వాటిని సక్రమంగా నిర్వహిస్తున్నారా అన్నదే ప్రశ్న? క్రెడిట్‌ కార్డు వినియోగంలో ఈ తప్పులు చేస్తే ఆర్థిక నష్టాలు తప్పవంటున్నారు నిపుణులు.

Image: RKC

మినిమమ్‌ డ్యూ కట్టడం

Image: RKC

బిల్లు మొత్తం కాకుండా మినిమమ్‌ డ్యూ కడితే.. బ్యాంకులు మొత్తం బిల్లుపై భారీగా వడ్డీ వసూలు చేస్తాయి. కొత్త లావాదేవీలకు వడ్డీ రహిత కాల వ్యవధి వర్తించదు. పైగా క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

Image: RKC

గరిష్ఠ పరిమితి వరకు ఖర్చు చేయడం

Image: RKC

క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో(సీయూఆర్‌) క్రెడిట్‌ లిమిట్‌లో 40శాతం మించకుండా చూసుకోవాలి. లేదంటే ఇది క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తుంది.

Image: RKC

క్రెడిట్‌కార్డుతో నగదు విత్‌డ్రా

Image: RKC

ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేస్తే విత్‌డ్రా ఫీజు వసూలు చేస్తారు. విత్‌డ్రా చేసిన నగదుపై రోజువారీ వడ్డీ విధిస్తారు. ఈ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. నగదు విత్‌డ్రాకు వడ్డీ రహిత కాల వ్యవధి ఉండదు.

Image: RKC

వడ్డీ రహిత సమయాన్ని సరిగా ప్లాన్‌ చేసుకోకపోవడం

Image: RKC

బిల్లింగ్‌ సైకిల్‌ ప్రారంభంలో క్రెడిట్‌కార్డును వినియోగిస్తే.. చెల్లింపులకు ఎక్కువ వడ్డీ రహిత కాలం ఉంటుంది. బిల్లింగ్‌ అయ్యే సమయంలో కొనుగోళ్లు చేస్తే వాటి చెల్లింపులు తొందరగా చేయాల్సి ఉంటుంది.

Image: RKC

ఆఫర్స్‌, రివార్డ్‌ పాయింట్లను పట్టించుకోకపోవడం

Image: RKC

క్రెడిట్‌కార్డుతో చేసే కొనుగోళ్లపై సంస్థలు రివార్డు పాయింట్స్‌, ఆఫర్స్‌ ఇస్తాయి. వాటిని భవిష్యత్తు కొనుగోళ్లలో రిడీమ్‌ చేసుకొని లబ్ధి పొందొచ్చు. దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది.

Image: RKC

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home