ప్రగ్యా నయన్.. సొగసు అదిరెన్..!
చిన్న సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది.. నటి ప్రగ్యా నయన్.
image:instagram
తాజాగా ఈ భామ.. ‘ఈ టీవీ విన్’ ఓటీటీలో విడుదలైన ‘మ్యాచ్ ఫిక్సింగ్’లో నటించింది.
image:instagram
సీనియర్ దర్శకుడు ఇ.సత్తిబాబు తెరకెక్కించిన ఈ చిత్రంలో విశ్వంత్, వసంతి కృష్ణన్, అభిజీత్‌తో కలిసి తెరను పంచుకుంది.
image:instagram
ఈ యంగ్ బ్యూటీ 1998 ఆగస్టు 17న ఝార్ఖండ్‌లో జన్మించింది. బిట్స్ పిలానీలో ఎంటెక్ చేసింది.
image:instagram
మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా.. మోడలింగ్, నటనపై ఆసక్తితో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
image:instagram
మోడలింగ్ చేస్తున్న క్రమంలో 2018లో వచ్చిన కన్నడ చిత్రం ‘ఎస్కేప్’లో నటించే ఛాన్స్ వచ్చింది. అలా ప్రగ్యా తొలిసారిగా వెండితెరపై కనిపించింది.
image:instagram
ఆ తర్వాత తెలుగులో ‘సురాపానం’,‘సమరం’, ‘ఇన్‌సెక్యూర్’ తదితర చిత్రాల్లో నటించింది. కానీ, ఆ సినిమాలేవీ సక్సెస్ సాధించ లేకపోయాయి.
image:instagram
సినిమాలతోపాటు పలు మ్యూజిక్ వీడియోలు, షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ మెరిసింది ప్రగ్యా.
image:instagram
ఈ భామకు డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం, విహారయాత్రలకు వెళ్లడమంటే చాలా ఇష్టమట.
image:instagram
సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
image:instagram