ఓటీటీలోనే ‘పంజా’ బ్యూటీ.. 

పవన్‌ కల్యాణ్‌ ‘పంజా’లో నటించిన హీరోయిన్‌ సారా జేన్‌ డయాస్‌ గుర్తుందా? పవన్‌ ప్రేమించే ‘సంధ్య’ పాత్రలో ఆకట్టుకుంది.

(Photos: Instagram/Sarah Jane Dias)

చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ భామ.. అప్పుడప్పుడు వెబ్‌సిరీస్‌ల్లో తళుక్కున మెరుస్తుంటోంది. 

తాజాగా శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’లోనూ అతిథి పాత్ర చేసింది. 

తెరపై ఎక్కువగా కనిపించకున్నా.. సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరువుగా ఉంటోంది. గ్లామర్‌ పిక్స్‌ పోస్టు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 


ఒమన్‌లోని మస్కట్‌లో పుట్టి పెరిగిన సారా.. ముంబయిలోని సెయింట్‌ ఆండ్రూస్‌ కాలేజ్‌లో డిగ్రీ చదివింది.

అనుకోకుండా ఓ ప్రచార చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలెంట్‌ హంట్‌లో విజేతగా నిలిచి ‘ఛానల్‌ వి’లో హోస్ట్‌గా అవకాశం దక్కించుకుంది. 

ఇక 2006లో ఆస్ట్రేలియన్‌ రాక్‌ గ్రూప్‌ రూపొందించిన ‘స్విచ్‌’ ఆల్బమ్‌లోని ‘నెవర్‌ లెట్‌ యూ గో’ పాటలో ఆడిపాడింది. 

పలు అందాల పోటీల్లో పాల్గొన్న సారా.. 2007లో ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకుంది. 

తొలిసారిగా 2010లో విశాల్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘తీరద విలైట్టు పిల్లై’తో తెరంగేట్రం చేసింది. 

ఆ మరుసటి ఏడాది అంటే 2011లో ‘గేమ్‌’తో బాలీవుడ్‌లో, ‘పంజా’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 

వరుసపెట్టి 2017 వరకు సినిమాలు చేసిన సారా.. ఆ తర్వాత వెండితెరకు దూరంగా ఉంటూ.. వెబ్‌ సిరీస్‌లో నటించడం మొదలుపెట్టింది. 

అలా ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’, ‘టైం ఔట్‌’, ‘తాండవ్‌’, ‘నెవర్‌ కిస్‌ యువర్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌’ తదితర వెబ్‌సిరీస్‌ల్లో నటించింది. ఇప్పుడు ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించింది. 

తాజాగా సారా నటించిన మరో వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్రీలాన్స్‌’ సెప్టెంబర్‌ 1న విడుదలకానుంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home