ఆరేళ్ల వయసుకే అద్దం ముందుకెళ్లి...

నవదీప్‌ ‘లవ్‌ మౌళి’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది పంకూరి గిద్వాని. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఈ రొమాంటిక్‌ మూవీలో నటించిన పంకూరి వ్యాఖ్యలు తాజాగా వైరల్‌ అవుతున్నాయి. ‘చిత్ర’ పాత్రలో ఆమె ఒలికించిన గ్లామర్‌ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. 

‘షాడోస్‌ ఆఫ్‌ లైఫ్’, ‘మహాపౌర్’, ‘గులాబి రేవడి’, ‘ఇష్క్‌ ఇ నదాన్‌’, ‘ఉజ్డా చామన్’ వంటి చిత్రాలతో అలరించింది. ‘లీక్‌డ్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. మే 5న వస్తోందీ సిరీస్‌. 

‘ఎప్పుడూ ఫ్యాషన్‌గా ఉండటం ఇష్టం. ఆరేళ్ల వయసులోనే అమ్మ డ్రెస్సింగ్‌ టేబుల్‌ వద్దకు వెళ్లి రకరకాల షేడ్స్‌లో ఉన్న లిప్‌స్టిక్‌లను ట్రై చేసేదాన్ని’ అని ఓ సందర్భంలో తెలిపింది.

This browser does not support the video element.

లఖ్‌నవూలో 1998లో పుట్టింది గిద్వాని. క్లాసికల్‌ డ్యాన్స్‌ అంటే ఇష్టం. 14 ఏళ్ల వయసు నుంచి కథక్‌లో శిక్షణ తీసుకుంది. 

స్కూల్‌లో గిద్వాని స్నేహితులతో కలసి ఒక బ్యాండ్‌ రన్‌ చేసేది. దాంట్లో డ్రమ్స్‌ వాయించేదట. 

This browser does not support the video element.

18 ఏళ్ల వయసులో ‘క్యాంపస్‌ ప్రిన్సెస్‌’ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ టైటిల్ ద్వారా ‘మిస్‌ ఇండియా’ కాంటెస్ట్‌లో 21 మంది ఫైనలిస్ట్‌ జాబితాలో అవకాశం దక్కింది. 

ఇంటర్ ఫైనలియర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండగా ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో అవకాశం వచ్చింది. ఎగ్జామ్స్‌ను పక్కనపెట్టి.. మోడలింగ్‌ను ఎంచుకుంది. '2016 ఫెమినా మిస్ ఇండియా' టైటిల్ గెలుచుకుంది.

సామాజిక బాధ్యతగా..గాంధీ కార్నర్‌ అనే సంస్థ ద్వారా.. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందిస్తుంది. 

‘విహారయాత్రలంటే కొండకోనల్లోకే వెళ్లాలి. అక్కడే ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా తగ్గిపోతుంది’ అని అంటోంది గిద్వాని.  

This browser does not support the video element.

ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెట్టే పంకూరి జిమ్‌లో తెగ కష్టపడుతుంది. వ్యాయామాన్ని కష్టంగా కాదు.. ఇష్టంగా ఆస్వాదిస్తూ చేస్తానంటోంది.

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

రకుల్‌ప్రీత్‌ ఫిజీ డైరీస్‌

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

Eenadu.net Home