సౌత్‌పై మనసుపడ్డ పరిణీతి!
తన అందం, అభినయంతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. పరిణీతి చోప్రా. ఇటీవల ఆమె నటించిన చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.
image:Instagram/parineetichopra
పరిణీతి ప్రధాన పాత్ర పోషించిన ‘కోడ్ నేమ్.. తిరంగా’ అక్టోబర్‌లోనే విడుదలై మిశ్రమ స్పందన పొందింది. ఇప్పుడు ఆ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
image:Instagram/parineetichopra
బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
image:Instagram/parineetichopra
సౌత్ సినిమాల్లో నటిచేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏదైనా సరే.. నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తన మనసులో మాటను బయటపెట్టింది.
image:Instagram/parineetichopra
దీంతో దక్షిణాదిలో ఏ దర్శకులు ఈమెకు సినిమా అవకాశం ఇస్తే బాగుంటుంది.. ఏ హీరోతో చేస్తే బాగుంటుందని నెట్టింట చర్చ జరుగుతోంది.
image:Instagram/parineetichopra
పరిణీతి చోప్రా.. 1988లో అక్టోబరు 22న హరియాణాలోని అంబాలాలో జన్మించింది.
image:Instagram/parineetichopra
తన తండ్రి పవన్ చోప్రా వ్యాపారవేత్త కావడంతో తను కూడా వ్యాపార రంగంలోనే స్థిరపడాలనుకుందట! అందుకోసం.. మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుంచి వ్యాపారం, ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో ట్రిపుల్ హానర్స్ డిగ్రీ అందుకుంది.
image:Instagram/parineetichopra
ఆ తర్వాత పరిణీతి.. యశ్ రాజ్ ఫిలిం పీఆర్ కన్సల్టెంట్‌గా పనిచేసింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన ఓ చిత్రంతో నటిగా మారింది.
image:Instagram/parineetichopra
This browser does not support the video element.
2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’తో తెరంగేట్రం చేసిందీ భామ. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’తో పాపులారిటీ దక్కింది. ఈమె ఇప్పటివరకూ 19కి పైగా సినిమాల్లో నటించింది.
image:Instagram/parineetichopra
టెలివిజన్ కార్యక్రమాల్లో కంటెస్టెంట్, జడ్జ్‌గా వ్యవహరించిందీ బ్యూటీ. పలు వాణిజ్య సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఉంది.
image:Instagram/parineetichopra
పరిణీతి నటిగానే కాదు.. సింగర్‌గా, డ్యాన్సర్‌గా మెప్పిస్తోంది. 2017లో వచ్చిన ‘మేరీ ప్యారీ బిందు’లో ఓ పాట పాడింది. బాలీవుడ్ హిట్ పాట ‘తేరి మిట్టీ’ ఫీమేల్ వర్షన్‌ను తనే పాడింది.
image:Instagram/parineetichopra
అనేక సినీ అవార్డు కార్యక్రమాల్లో కో-హోస్ట్‌గా ఆకట్టుకుంది. స్టేజ్ డ్యాన్స్‌తో అదరగొట్టింది.
image:Instagram/parineetichopra
ఈ గ్లామర్ బ్యూటీకి వివిధ ప్రదేశాలకు వెళ్లడం చాలా ఇష్టం. సమయం కుదుర్చుకుని మరీ నచ్చిన ప్రాంతాలకు వెళ్లిపోతుంటుంది.
image:Instagram/parineetichopra
బొద్దుగా ఉండే ఈ బాలీవుడ్ హీరోయిన్.. కెరీర్ పీక్‌లో ఉండగానే సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. బరువు తగ్గే ప్రయత్నం చేసింది. అనుకున్నట్లుగానే సన్నబడింది కానీ.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.
image:Instagram/parineetichopra
తరచూ ఫొటోషూట్‌లో పాల్గొని తన గ్లామర్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఈమెకు ఇన్‌స్టాలో 39.1 మిలియన్ ఫాలోవర్లున్నారు.
image:Instagram/parineetichopra