పారాలింపిక్స్‌.. చరిత్రలో ‘ఫస్ట్’ పతక వీరులు 

టీవల ముగిసిన పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 29 పతకాలు వచ్చాయి. ఈ క్రమంలోనే పతకాలు సాధించిన కొంతమంది అథ్లెట్లు ఆయా విభాగాల్లో చరిత్ర సృష్టించారు.

అవని లేఖరా (షూటింగ్)

రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్‌గా రికార్డు

2020 టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్, కాంస్య పతకం.. 2024 పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అవని లేఖరా

ధరంబీర్‌ సింగ్‌, ప్రణవ్‌ (క్లబ్‌ త్రో)

ఈ విభాగంలో దేశానికి తొలిసారి పతకాలు తెచ్చిన అథ్లెట్లుగా రికార్డు.

ఈ పారాలింపిక్స్‌లో ధరంబీర్‌ సింగ్‌ స్వర్ణం, ప్రణవ్‌ రజతం గెలుచుకున్నారు.

హర్విందర్‌ సింగ్‌ (ఆర్చర్‌)

పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన తొలి భారత ఆర్చర్‌గా హర్విందర్‌ రికార్డు

ఈ పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన హర్విందర్‌

మనీశా రామదాస్ (బ్యాడ్మింటన్)

పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ షట్లర్‌గా రికార్డు

ఈ పారాలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో కాంస్యం సాధించిన మనీశా

 ప్రీతిపాల్ (ట్రాక్‌ ఈవెంట్)

ట్రాక్‌ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా రికార్డు

2024లో పరుగు పందెం.. మహిళల 100మీ T35లో కాంస్యం గెలిచిన ప్రీతిపాల్

మరియప్పన్ తంగవేలు (హైజంప్)

వరుసగా మూడు ఎడిషన్లలో పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు 

2016లో స్వర్ణం, 2020లో రజతం, 2024లో కాంస్యం సాధించిన తంగవేలు

కపిల్‌ పర్మార్‌ (జూడో)

జూడో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గా రికార్డు

2024లో కాంస్యం సాధించిన కపిల్ పర్మార్‌

సుహాస్ యతిరాజ్‌ (బ్యాడ్మింటన్)

పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డు

2020, 2024లో రజతాలు సాధించిన సుహాస్

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home