పార్ట్‌టైం జాబ్‌ చేస్తారా? ఇవిగో మార్గాలు!

ఈ కాలంలో చిరు ఉద్యోగులు, విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదంటే.. తీరిక సమయాన్ని కూడా సంపాదించుకునేందుకు కేటాయించాల్సిన పరిస్థితి. మరి ఖాళీ సమయాల్లో పార్ట్‌ టైమ్‌గా ఏ పనులు చేయొచ్చంటే..

Image: RKC

ట్యూటర్‌

మీ తీరక సమయాల్లో మీకు పట్టు ఉన్న సబ్జెక్టుపై విద్యార్థులకు ట్యూషన్స్‌ చెప్పొచ్చు. నేరుగా లేదా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చు.

Image: RKC

ట్రాన్స్‌లేటర్‌

పుస్తకాలు, ఇతర పబ్లికేషన్స్‌ను ఇంగ్లీష్‌ నుంచి స్థానిక భాషల్లోకి తర్జుమా చేసే పనికి చాలా డిమాండ్‌ ఉంది. టైపింగ్‌ వచ్చి ఉంటే దీన్ని ట్రై చేయొచ్చు. 

Image: RKC

డేటా ఎంట్రీ ఆపరేటర్‌

వేగంగా టైపింగ్‌ చేసే నైపుణ్యం ఉంటే డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా అవకాశాలుంటాయి. వివిధ రూపాల్లో ఉన్న సమాచారాన్ని ఫైల్‌గా మార్చాల్సి ఉంటుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశమూ ఉంటుంది. 

Image: RKC

కంటెంట్‌ రైటింగ్‌

కొత్తగా ఆలోచించడం, కంటెంట్‌ను భిన్నంగా.. ఆకట్టుకునేలా రాయగలిగేవారిని కంటెంట్‌రైటింగ్‌ ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో అన్వేషిస్తే బోలెడు ఉద్యోగాలు లభిస్తాయి. 

Image: RKC

బ్లాగర్‌

వివిధ అంశాలను ఎంచుకొని, ఆసక్తికరంగా కథనాలు రాస్తూ.. మీ బ్లాగ్‌లో పోస్టు చేయాలి. అవి నెటిజన్లను ఆకట్టుకుంటే బ్లాగర్‌గా మంచి గుర్తింపుతోపాటు ప్రకటనల ద్వారా ఆదాయమూ ఉంటుంది.

Image: RKC

యూట్యూబర్‌

యూట్యూబ్‌లో ఛానల్‌ ప్రారంభించి ఆసక్తికరమైన వీడియోలను రూపొందించి పోస్టు చేయాలి. ప్రకటనలు, వీడియోల వీక్షణలను బట్టి ఆదాయం వస్తుంది.

Image: RKC

గేమ్‌ టెస్టర్‌

గేమ్స్‌ రూపొందించే సంస్థలు వాటిలోని లోపాలను కనిపెట్టేందుకు కొందరిని నియమించుకుంటాయి. అభివృద్ధి దశలో ఉన్న గేమ్‌ను ఆడి అందులోని లోపాల్ని నిపుణులకు తెలియజేయాల్సి ఉంటుంది. 

Image: RKC

డ్రైవింగ్‌

డ్రైవింగ్‌ నైపుణ్యముంటే ఖాళీ సమయాల్లో క్యాబ్‌, బైక్‌ ట్యాక్సీ సేవలు అందించొచ్చు. ఉబర్‌, ఓలా వంటి సంస్థల్లో పార్ట్‌టైమ్‌ డ్రైవర్‌గా పనిచేయొచ్చు.

Image: RKC

ఫుడ్‌ డెలివరీ

ఏ పనైనా ఫర్వాలేదు అనుకునేవారు.. ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేయొచ్చు. ఈ మధ్య ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ వినియోగం పెరగడంతో డెలివరీ బాయ్స్‌ అవసరం కూడా పెరిగింది. 

Image: RKC

ప్రపంచంలోనే బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌

ఇండియాకు +91 కోడ్‌ ఎలా వచ్చింది?

టెస్లా గురించి మీకివి తెలుసా?

Eenadu.net Home