సమోసా శిరీషానే ‘పుష్ప’రాజ్ అన్న కూతురు
‘పుష్ప 2’లో పుష్పరాజ్‌కి అన్న కూతురు ‘కావేరి’గా కనిపించింది పావని కరణం. ఇప్పుడు ఈమె గురించి నెట్టింట తెగ వెతుకుతున్నారు.
2018లో ‘కిర్రాక్ పార్టీ’లో అతిథి పాత్ర ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పావని కరణం.
2019లో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ వెబ్‌సిరీస్ చేసింది. ఆ తర్వాత ‘పుష్ప’కి ఆడిషన్ ఇచ్చి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
పావని పుట్టి పెరిగింది విశాఖపట్నంలో.. ఇంజినీరింగ్ పూర్తి చేసింది. కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసి మానేసింది.
షార్ట్‌ఫిల్మ్స్, డబ్బింగ్, యాంకరింగ్ చేసింది. 2023లో ‘పరేషాన్’తోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
‘పరేషాన్’లో తెలంగాణ అమ్మాయిగా ‘శిరీష’ పాత్రలో అలరించింది. ‘సమోసా తింటావా శిరీషా..’ డైలాగ్ ఎంత ఫేమస్సో మీకూ తెలుసు..
ఆమె నటించిన ‘పైలం పిలగా’ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘ఆహారం శరీరానికి ఫ్యూయెల్ లాంటిది. తినేటప్పుడు శ్రద్ధగా తింటాను. అన్నింటిలోనూ సమోసా ఇష్టం’ అని చెప్పింది.
సినిమా, సన్‌లైట్, స్మైల్స్ ఇవి ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటాను అంటోంది పావని.