IMDbలో టాప్‌ రేటెడ్‌ పవన్‌ చిత్రాలివీ!

1. తొలిప్రేమ (8.4)

పవన్‌ కల్యాణ్ కెరీర్‌లో నాలుగో చిత్రమిది. దర్శకుడు కరుణాకరన్‌ తెరకెక్కించిన ఈ సినిమా 1998లో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌.

2. ఖుషి (8.1)

పవన్‌ సినిమాల్లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. 2001లో వచ్చిన ఈ సినిమాలో పవన్‌ మేనరిజమ్స్‌, సొంతంగా కొరియోగ్రఫీ చేసిన ఫైట్లు అదుర్స్‌ అనిపించాయి. ఎస్‌.జే సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక చావ్లా హీరోయిన్‌. ఇటీవల రీరిలీజ్‌ అయింది. 

3. తమ్ముడు (7.9)

అన్న కలని నెరవేర్చే ‘తమ్ముడు’ సుబ్బుగా పవన్‌ నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. 1999లో విడుదలైన ఈ చిత్రానికి పి.ఎ. అరుణ్‌ ప్రసాద్‌ దర్శకుడు. ప్రీతి ఝాంగియాని, అదితి గోవరికర్‌ హీరోయిన్లుగా నటించారు. 

4. జల్సా (7.4)

త్రివిక్రమ్‌ - పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం. 2008లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా నటించింది.

5. బద్రి (7.3)

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2000లో విడుదలైంది. పవన్‌ కల్యాణ్ చెప్పే డైలాగులు ఇందులో హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో పవన్‌ సరసన రేణు దేశాయ్‌, అమిషా పటేల్‌ నటించారు. 

6. అత్తారింటికి దారేది (7.3)

తివ్రిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ నటించిన రెండో చిత్రం. సమంత, ప్రణీత హీరోయిన్లు. 2013లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 

7. గోపాల గోపాల (7.2)

బాలీవుడ్‌ చిత్రం ‘ఓఎంజీ’కి తెలుగు రీమేక్‌ ఇది. 2015లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్‌ ట్రెండీ దేవుడిగా కనిపించడం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.

8. గబ్బర్‌ సింగ్‌ (7.1)

సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌’లో కొన్ని మార్పులు చేసి హరీశ్‌ శంకర్‌ ఈ సినిమాని తెలుగులో తెరకెక్కించారు. ఇందులో పవన్‌ తనదైన స్టైల్‌లో పోలీస్‌ పాత్రను పోషించి అభిమానులతో ఈలలు వేయించారు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో హీరోయిన్‌ శ్రుతి హాసన్‌.

9. వకీల్‌సాబ్‌ (7.0)

వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. హిందీ ‘పింక్‌’కి రీమేక్‌. 2021లో కోర్ట్‌రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ లాయర్‌గా నటించి మెప్పించారు. ఇందులోనూ శ్రుతి హాసనే హీరోయిన్‌. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. 

10. పంజా (6.5)

తమిళ దర్శకుడు విష్ణువర్థన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్‌ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్‌, అంజలి లవానియా హీరోయిన్లు.

నా భర్తనే ఇల్లరికం రమ్మంటా!

గాలా.. హొయలు అదిరిపోలా

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home